తుర్కపల్లి యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన మండలము. మండలంలో 22 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. ఈ మండలం భువనగిరి రెవెన్యూ డివిజన్, ఆలేరు అసెంబ్లీ నియోజకవర్గం, భువనగిరి లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. మండలంలోని గంధమల్ల చెరువును రిజర్వాయరుగా అభివృద్ధి చేస్తున్నారు. పిన్ కోడ్ 508112. భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలం జిల్లాలో వాయువ్యాన సిద్ధిపేట జిల్లా సరిహద్దులో ఉంది. ఈశాన్యాన రాజాపేట మండలం, తూర్పున యాదగిరిగుట్ట మండలం, దక్షిణాన భువనగిరి మండలం, నైరుతిన బొమ్మలరామారాం మండలం, ఉత్తరాన మరియు వాయువ్యాన సిద్ధిపేట జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. జనాభా: 2001 లెక్కల ప్రకారం మండల జనాభా 32142, 2011 నాటికి 33866. ఇందులో పురుషులు 17097, మహిళలు 16769. రాజకీయాలు: ఈ మండలము ఆలేరు అసెంబ్లీ నియోజకవర్గం, భువనగిరి లోకసభ నియోజకవర్గంలో భాగముగా ఉన్నది. మండలంలోని రెవెన్యూ గ్రామాలు: China Laxma Puram, Dattaipally, Dharmaram, Gandamalla, Gopal Puram, Ibrahimpuram, Komatikunta, Konapuram, Kondapuram, M. Turkapalle, Madhapuram, Malkapuram, Mulakala Pally, Nagai Palle, Palle Pahad, Rusta Puram, Srinivasapuram, Tirmalapuram, Vasalamarri, Veerareddi Pally, Velpupally, Venkatapuram,
ప్రముఖ గ్రామాలు
...వాసాలమర్రి (Vasalamarri) :
వాసాలమర్రి యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలానికి చెందిన గ్రామం. ఈ గ్రామాన్ని ముఖ్యమంత్రి KCR తీసుకొని అన్ని విధాలుగా అభివృద్ధి పరుస్తున్నారు. జూన్ 22, 2021న కేసీర్ గ్రామాన్ని సందర్శించి గ్రామస్థులతో సహపంక్తి భోజనాలు చేశారు. తెలంగాణ సాయుధ పోరాటంలో మరియు తెలంగాణ ఉద్యమంలో కూడా ఈ గ్రామం ప్రముఖ పాత్ర వహించింది. ... ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Gandhamalla reservoir, Thurkapalli Mandal Nalgonda Dist (district) Mandal in telugu, nalgonda Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి