రామన్నపేట యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన మండలము. విష్ణుకుండినులకు రాజధానిగా పనిచేసిన ఇంద్రపాలనగరం (తుమ్మలగూడెం) ఈ మండలంలోనే ఉంది. 2016 జిల్లాల పునర్విభజనకు ముందు నల్గొండ జిల్లాలో ఉండేది. ఈ మండలం చౌటుప్పల్ రెవెన్యూ డివిజన్, నక్రేకల్ అసెంబ్లీ నియోజకవర్గం, భువనగిరి లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. బీబీనగర్-నడికూడి రైలుమార్గం మండలం మీదుగా వెళ్ళుచున్నది. సాహితీవేత్త కూరెళ్ల విఠలాచార్య ఈ మండలమునకు చెందినవారు.
భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలం జిల్లాలో ఆగ్నేయాన నల్గొండ జిల్లా సరిహద్దులో ఉంది. ఉత్తరాన వలిగొండ మండలం, పశ్చిమాన చౌటుప్పల్ మండలం, దక్షిణాన మరియు తూర్పున నల్గొండ జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. జనాభా: 2001 లెక్కల ప్రకారం మండల జనాభా 52322, 2011 నాటికి జనాభా 51389. ఇందులో పురుషులు 25514, మహిళలు 25875. పట్టణ జనాభా 10061, గ్రామీణ జనాభా 41328. రాజకీయాలు: ఈ మండలము నక్రేకల్ అసెంబ్లీ నియోజకవర్గం, భువనగిరి లోకసభ నియోజకవర్గంలో భాగముగా ఉన్నది. మండలంలోని రెవెన్యూ గ్రామాలు: ఇస్కిల్ల, ఉత్తాపూర్, ఎన్నారం, ఎల్లంకి, కుంకుడు పాముల, కొక్కిరేణి, జానంపల్లి, తుమ్మలగూడెం, దుబ్బాక, నిధానపల్లి, నీర్నెముల, పల్లివాడ, బాచుప్పల, బి.తుర్కపల్లి, బోగారం, మునిపంపుల, రామన్నపేట, లక్ష్మాపూర్, శోభనాద్రిపురం, సిరిపురం, సూరారం
ప్రముఖ గ్రామాలు
నీర్నెముల (Neernemula):నీర్నెముల యాదాద్రి జిల్లా రామన్నపేట మండలమునకు చెందిన గ్రామము. అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటి వైస్ ఛాన్సలర్‌గా పనిచేసిన దుడ్డు రాంచంద్రం, సాహితీవేత్త కూరెళ్ల విఠలాచార్య ఈ మండలమునకు చెందినవారు. సిరిపురం (Siripuram): ఈ గ్రామం చేనేత వస్త్రాల తయారికి ప్రసిద్ధి చెందినది. గ్రామ జనాభా సుమారు 4500. ఇది మండల కేంద్రానికి 4 కిమీ దూరంలో ఉన్న ఈ గ్రామంలో 50% కుటుంబాలు చేనేత జీవనాధారంగా కలిగియున్నారు. గ్రామంలో చేనేత సహకార సంఘం ఉంది. బెట్‌షీట్ల తయారీకి ఈ గ్రామం జిల్లాలోనే పేరుగాంచినది. తుమ్మలగూడెం (Thummalagudem): తెలంగాణ చరిత్రలో సుప్రసిద్ధమైన ఇంద్రపాలనగరం ఇదే. ఈ గ్రామం విష్ణుకుండినులకు రాజధానిగా పనిచేసింది. అనేక ప్రాచీన కట్టడాలు, అవశేషాలు గ్రామంలో ఉన్నాయి. ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Rajapet Fort, Rajapet Mandal Nalgonda Dist (district) Mandal in telugu, nalgonda Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి