కేశంపేట రంగారెడ్డి జిల్లాకు చెందిన మండలము. ఇది 78డి 20' 52" తూర్పు రేఖాంశం, 16 డి 57'54" ఉత్తర అక్షాంశంపై ఉంది. ఈ మండలం షాద్‌నగర్ రెవెన్యూ డివిజన్, షాద్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం, మహబూబ్ నగర్ లోకసభ నియోజకవర్గం పరిధిలో ఉంది. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 42453. మండలంలో 20 రెవెన్యూ గ్రామాలు, 19 గ్రామపంచాయతీలున్నాయి. అక్టోబరు 11, 2016 నాటి జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం మహబూబ్‌నగర్ జిల్లాలో ఉండేది.
భౌగోళికం: ఈ మండలం 78డి 20' 52" తూర్పు రేఖాంశం, 16 డి 57'54" ఉత్తర అక్షాంశంపై ఉంది. మండల విస్తీర్ణం 21514 హెక్టార్లు. అందులో 747 హెక్టార్ల అటవీ భూములున్నాయి. సరిహద్దులు: ఈ మండలానికి ఉత్తరాన మహేశ్వరం మండలం, కొత్తూరు మండలం, తుర్పున కడ్తాల్ మండలం, ఆగ్నేయాన తలకొండపల్లి మండలం, వాయువ్యాన ఫరూఖ్‌నగర్ మండలం, నైరుతిన మహబూబ్‌నగర్ జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. జనాభా: 2001 లెక్కల ప్రకారం మండల జనాభా 39537. ఇందులో పురుషులు 20326, మహిళలు 19209. జనసాంద్రత 181. స్త్రీపురుష నిష్పత్తి 943. అక్షరాస్యత శాతం 47.16%. ఎస్సీల సంఖ్య 8078, ఎస్టీల సంఖ్య 3279. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 42453. ఇందులో పురుషులు 21676, మహిళలు 20777. జనాభాలో ఇది జిల్లాలో 58వ స్థానంలో ఉంది. రవాణా సౌకర్యాలు: షాద్ నగర్ నుంచి ఆమనగల్ వెళ్ళు రహదారి మండలం నుంచి వెళ్ళుచున్నది. రాజకీయాలు: ఈ మండలము షాద్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం, మహబూబ్ నగర్ లోకసభ నియోజకవర్గంలో భాగముగా ఉన్నది. 2001 జడ్పీటీసి ఎన్నికలలో తెరాస పార్టీకి చెందిన ఎల్గమోని అంజయ్య, 2006 జడ్పీటీసి ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఉమాదేవి ఎన్నికయ్యారు. 2014లో ఎంపీపీగా తెరాస పార్టీకి చెందిన వి.లక్ష్మమ్మ ఎన్నికయ్యారు.
2008-09 నాటికి మండలంలో 36 ప్రాథమిక పాఠశాలలు (34 మండల పరిషత్తు, 2 ప్రైవేట్), 14 ప్రాథమికోన్నత పాఠశాలలు (11 మం.ప, 3 ప్రైవేట్), 8 ఉన్నత పాఠశాలలు (6 జడ్పీ, 2 ప్రైవేట్), 2 జూనియర్ కళాశాలలు (1 ప్రభుత్వ, 1 ప్రైవేట్) ఉన్నాయి. వ్యవసాయం, నీటిపారుదల: మండలం మొత్తం విస్తీర్ణం 21514 హెక్టార్లలో 49% భూమి వ్యవసాయ యోగ్యంగా ఉన్నది. మండలంలో పండించే ప్రధాన పంట మొక్కజొన్న, ప్రత్తి. కందులు, జొన్నలు, వరి కూడా పండిస్తారు. మండల సాధారణ వర్షపాతం 607 మిమీ. మండలంలో సుమారు 2700 హెక్టార్లకు నీటిపారుదల సౌకర్యం ఉంది. మండలంలోని గ్రామాలు: ఆల్వాల్ (Alwal), భైర్‌ఖాన్‌పల్లి (Bhairkhanpalle), చింతలకుంటపల్లి (Chintakuntapalle), బోదనంపల్లి (Bodanampalle), చౌలపల్లి తూర్పు (Chowlapalle East), దత్తాయిపల్లి (Dattaipalle), ఎక్లాస్‌ఖాన్‌పేట (Eklaskhampeta), ఇప్పరపల్లి (Ipparapalle), కాకునూర్ (Kakunoor), కేశంపేట (Keshampeta), కొత్తపేట (Kothapeta), లేమామిడి (Lemamidi), లింగమదాన (Lingamdana), నిర్దవల్లి (Nirdavally), పాపిరెడ్డిగూడ (Papireddiguda), పోమాల్‌పల్లి (Pomalpalle), సంగం (Sangam), సంతాపూర్ (Santhapur), తొమ్మిదిరేకుల (Thommidirekula), వేములనర్వ (Vemulanarva)
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
22, జనవరి 2013, మంగళవారం
కేశంపేట మండలం (Keshampet Mandal)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి