కల్వకుర్తి నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన మండలము. హైదరాబాదు-శ్రీశైలం రహదారి మండలం గుండా వెళ్తుంది. జిల్లాలోనే తొలి చేనేత సహకార సంఘం 1952లో రఘుపతిపేటలో ఏర్పాటైంది. ఈ మండలం మహబూబ్‌నగర్ రెవెన్యూ డివిజన్, కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం, నాగర్ కర్నూల్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 64153. అచ్చంపేట నియోజకవర్గం నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన పోతుగంటి రాములు, రచయిత ముకురాల రామారెడ్డి ఈ మండలమునకు చెందినవారు. మార్చాల గ్రామంలో పురాతనమైన శివాలయం ఉంది. మండలకేంద్రంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉన్నది.
మండల సరిహద్దులు: ఈ మండలమునకు ఉత్తరమున వెల్దండ మండలము, తూర్పున వెల్దండ, వంగూరు మండలములు, దక్షిణమున కొంతవరకు టెల్కపల్లి మండలము, పశ్చిమాన తాడూరు, మిడ్జిల్ మండలములు సరిహద్దులుగా ఉన్నాయి. జనాభా: 2001 లెక్కల ప్రకారం మండల జనాభా 58217. ఇందులో పురుషులు 29827, మహిళలు 28390. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 64153. ఇందులో పురుషులు 32742, మహిళలు 31411. పట్టణ జనాభా 28110, గ్రామీణ జనాభా 36043. జనాభాలో ఇది జిల్లాలో 22వ స్థానంలో ఉంది. రవాణా సౌకర్యాలు: మహబూబ్ నగర్ నుంచి దేవరకొండ, నల్గొండ వైపు వెళ్ళు రహదారి మండలం నుంచే వెళ్ళుచున్నది. హైదరాబాదు, నాగర్ కర్నూల్ నుంచి కూడా కల్వకుర్తికి మంచి రోడ్డు సౌకర్యాలున్నాయి. కల్వకుర్తిలో ఆర్టీసి డీపో ఉన్నది.
ఈ మండలము కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం, నాగర్ కర్నూల్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. శాసనసభ్యులుగా ఎన్నికైన పి.రాములు, ఎడ్మ కిష్టారెడ్డి ఈ మండలమునకు చెందినవారు. 2001 జడ్పీటీసి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి చెందిన డొక్కా హరిదాస్, 2006 జడ్పీటీసి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎన్.సుభాషిణి ఎన్నికయ్యారు. విద్యాసంస్థలు: 2008-09 నాటికి మండలంలో 53 ప్రాథమిక పాఠశాలలు (40 మండల పరిషత్తు, 2 ప్రైవేట్ ఎయిడెడ్, 11 ప్రైవేట్ అన్-ఎయిడెడ్), 16 ప్రాథమికోన్నత పాఠశాలలు (1 ప్రభుత్వ, 8 మండల పరిషత్తు, 1 ప్రైవేట్ ఎయిడెడ్, 6 ప్రైవేట్ అన్-ఎయిడెడ్), 25 ఉన్నత పాఠశాలలు (4 ప్రభుత్వ, 7 జడ్పీ, 2 ప్రైవేట్ ఎయిడెడ్, 12 ప్రైవేట్ అన్-ఎయిడెడ్), 8 ప్రభుత్వ జూనియర్ కళాశాలు (1 ప్రభుత్వ, 7 ప్రైవేట్) ఉన్నవి.
మండలం మొత్తం విస్తీర్ణం 26796 హెక్టార్లలో 42% భూమి వ్యవసాయ యోగ్యంగా ఉన్నది. మండలంలో పండించే ప్రధాన పంట ప్రత్తి. వరి. మొక్కజొన్న, కందులు, వేరుశనగ కూడా పండిస్తారు. మండల సాధారణ వర్షపాతం 643 మిమీ. మండలంలో సుమారు 3200 హెక్టార్లకు నీటిపారుదల సౌకర్యం ఉంది. కాలరేఖ:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Tags: Kalwakurthy Mandal in Telugu, Kalwakurthy Mandal information in Telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి