25, జనవరి 2013, శుక్రవారం

పాగ పుల్లారెడ్డి (Paga Pulla Reddy)

జననంమే 10, 1919
జిల్లాజోగులాంబ గద్వాల జిల్లా
రంగంవిమోచనోద్యమం, రాజకీయాలు,
పదవులుపురపాలక సంఘం చైర్మెన్, ఎమ్మెల్యే,
మరణంఅక్టోబరు 20, 2010.
ప్రముఖ నిజాం వ్యతిరేక ఉద్యమకారుడు, రాజకీయ నాయకుడైన పాగ పుల్లారెడ్డి 1919, మే 10న జోగులాంబ గద్వాల జిల్లా మానోపాడు మండలం జల్లాపూర్ గ్రామంలో జన్మించారు. చిన్న వయస్సులోనే తల్లిదండ్రులు మరణించగా గద్వాల మహారాణి ఆదిలక్ష్మి దేవమ్మ సహాయంతో విద్యాభ్యాసం పూర్తిచేశారు. 1947-48 కాలంలో హైదరాబాదు సంస్థానం భారత యూనియన్ లో విముక్తి కావడానికి చేపట్టిన ఉద్యమంలో చేరి చురుకుగా వ్యవహరించారు. 3 మాసాలు గౌతు లచ్చన్న నిర్వహించిన సైనిక శిభిరంలో శిక్షణ పొంది కర్నూలు ప్రాంతం డిక్టేటరుగా నియమించబడ్డారు.

విమోచనోద్యమ అనంతరం 1952లో గద్వాల-ఆలంపూర్ ద్విసభ్య నియోజకవర్గం నుంచి హైదరాబాదు రాష్ట్ర శాసనసభకు ఎన్నికైనారు. హైదరాబాదు, ఆంధ్ర రాష్ట్రాల విలీనం సమయంలో కొత్త రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ అని పేరు మొదట సూచించినది పాగపుల్లారెడ్డి. ఈ ప్రతిపాదనకు బూర్గుల రామకృష్ణారావు బలమర్చినారు.

పాగ పుల్లారెడ్డి 1968లో గద్వాల పురపాలక సంఘ చైర్మెన్ గా, 1972లో గద్వాల నియోజకవర్గం నుంచి శాసనసభ సభ్యుడిగా ఎన్నికైనారు. 1984-87 కాలంలో గద్వాల వ్యవసాయ మార్కెట్ కమిటి చైర్మెన్ గా పనిచేశారు. కళారంగానికి ఎంతో కృషిచేసి కళారంగపోషకుడిగా పేరుపొందినారు. గద్వాలలో లలితకళాభివృద్ధి సంఘం ఏర్పాటుచేయడమే కాకుండా బాలభవన్ లాంటి సంస్థల అభివృద్ధికి పాటుపడ్డారు. గద్వాలలో ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల స్థాపన ఇతని కృషి ఫలితమే. ప్రతినెల సాహితీసాంస్కృతిక కార్యక్రమం నిర్విరామంగా నిర్వహించారు. 2010, అక్టోబరు 20న మరణించారు.


విభాగాలు: జోగులాంబ గద్వాల జిల్లా రాజకీయ నాయకులు,  జోగులాంబ గద్వాల జిల్లా సమరయోధులు,  ఆలంపూర్ అసెంబ్లీ నియోజకవర్గంగద్వాల అసెంబ్లీ నియోజకవర్గం,  
= = = = =

4 వ్యాఖ్యలు:

 1. NENU KUDA MAHABUBNAGAR VASINE, THANK YOU IDI ABHINANDANAMSHAM

  ప్రత్యుత్తరంతొలగించు
 2. ప్రత్యుత్తరాలు
  1. పాగపుల్లారెడ్డికి సంబంధించిన పుస్తకాలను నేను మహబూబ్‌నగర్ పట్టణం న్యూటౌన్‌లోని ఎస్.ఎస్.ఆర్.గ్రంథాలయంలో చాలా చూశాను. పాలమూరు జిల్లా క్విజ్ మరియు పాలమూరు జిల్లా విజ్ఞానసర్వస్వం రూపకల్పన సమయంలో అక్కడే అనేక పుస్తకాలను శోధించి సమాచారం కూడా గ్రహించాను. పుస్తకాల పేర్లు మాత్రం నాకు గుర్తులేదు కాని ఆ గ్రంథాలయం సందర్శిస్తే వారికి సంబంధించిన సమాచారం మీకు లభ్యంకావచ్చు.

   తొలగించు

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక