27, జనవరి 2013, ఆదివారం

ఉమామహేశ్వరం (Uma Maheshwaram)

శ్రీశైలం ఉత్తరద్వారంగా భాసిల్లుతోన్న ఉమామహేశ్వర దేవాలయం అచ్చంపేట మండలం, రంగాపూర్ గ్రామపంచాయతి పరిధిలో ఉన్నది. ఈ క్షేత్రం హైదరాబాదు-శ్రీశైలం ప్రధాన రహదారిపై హైదరాబాదు నుంచి 140 కిమీ దూరంలో ఉంది. జిల్లా కేంద్రం మహబూబ్ నగర్ నుంచి 90 కిమీ, అచ్చంపేట నుంచి 12 కిమీ, రంగాపూర్ నుంచి 3 కిమీ దూరంలో ఉన్న ఈ క్షేత్రం ప్రముఖ సిద్ధక్షేత్రంగా, ఉమాశక్తిపీఠంగా వెలుగొందుతున్నది. రావణుడిని హతమార్చిన పిమ్మట శ్రీరాముడు ఉమామహేశ్వరం నుంచే శ్రీశైలక్షేత్ర ప్రదర్శన ప్రారంభించినట్లు శ్రీశైల స్థల పురాణం వివరిస్తుంది. నల్లమల అడవులలో భాగమైన 500 అడుగుల కొండపైనుంచి జాలువారే జలపాతాలు భక్తులు, పర్యాటకులను కనువిందుచేస్తాయి. ఈక్షేత్రంలో మొత్తం 11 తీర్థాలున్నాయి. ఇందులో రుద్రధార, భస్మధార, గిరిధార, పాపనాశిని ముఖ్యమైనవి. ఇవన్నియూ నిరంతరం పారే జలపాతాలే. ఈ జలపాతాలకిందనేలింగప్రతిష్టలు ఉన్నాయి. ప్రధాన ధార అయిన రుద్రధార కిందనే ఉమామహేశ్వరస్వామి కొలువై ఉన్నాడు. ఉమామహేశ్వరస్వామికి కుడివైపున పార్వతి, ఎడమవైపున వీరభద్రుని విగ్రహాలున్నాయి. ఉమామహేశ్వర ఆలయం దృష్ట్యా రుద్రధారను మన్ననూరులోని దురాయి చెరువులోకి మళ్ళించబడింది.
పూర్వకాలంలో ఈ క్షేత్రం వద్ద మునులు తపస్సు చేసేవారు. కాకతీయులకాలంలో ఈ క్షేత్రం ఎంతో ప్రసిద్ధి చెందినట్లుగా పండితారాధ్య చరిత్ర తెలుపుతుంది. పండితారాధ్యుని శిష్యుడు దోనమయ్య ఈ దారినే శ్రీశైలం వెళ్ళినట్లు తెలుస్తుంది. గణపతిదేవుని కాలంలో అమ్రాబాదు ప్రాంతాన్ని చెరుకు బొల్లయ్యరెడ్డి అనే అమరనాయకుడు పాలించేవాడు. ఆయన భాండాగారాధ్యక్షుడు కరణం రామయ్య ఈ క్షేత్రంలో అనేక నిర్మాణాలు చేపట్టాడు. కాకతీయుల కాలం వరకు ఇక్కడ నిర్మితమైన ఆలయం లేదు. కాకతీయుల తర్వాత ఈ ప్రాంతం దేవరకొండ, రాచకొండలను పాలించిన వెలమల కిందికి వచ్చింది. 1376లో మాదానాయుడు కొండపైకి వెళ్ళేందుకు మెట్లు నిర్మించాడు. 1960 కాలంలో రంగాపూర్ కు చెందిన మర్యాద గోపాలరెడ్డి ఈ క్షేత్రాన్ని అభివృద్ధి చేశారు. ఏటా జనవరి 15 నుంచి వైభంవంగా ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ ఆలయం పశ్చిమాభిముఖంగా ఉంది. 1967 ఆగస్టు 12న జగద్గురు శృందేరీ శారదాపీఠాధిపతిచే ధ్వజస్తంభాన్ని పున:ప్రతిష్టాపన చేయబడింది.వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక