28, జనవరి 2013, సోమవారం

పల్లెర్ల హనుమంతరావు (Pallerla Hanmanth Rao)

పల్లెర్ల హన్మంతరావు
జననం1908, మే 27
స్వస్థలంమహబూబ్‌నగర్
మరణం1979, సెప్టెంబరు 19
చేపట్టిన పదవులుఎమ్మెల్యే (1952-57), రాష్ట్రమంత్రి, ఎంపి (1957-67),
నియోజకవర్గంమహబూబ్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం, మెదక్ లోకసభ నియోజకవర్గం,


పాలమూరు జిల్లాకు చెందిన సమరయోధులు, రాజకీయ నాయకులలో ప్రముఖులైన పల్లెర్ల హన్మంతరావు 1908 మే 27న లో మహబూబ్‌నగర్ పట్టణంలో జన్మించారు. న్యాయవిద్యను అభ్యసించి మహబూబ్‌నగర్‌లో న్యాయవాద వృత్తిని చేపట్టారు. ఆ తర్వాత బూర్గుల రామకృష్ణారావు, మాడపాటి హనుమంతరావు తదితర ప్రముఖులతో కలిసి ఉద్యమాలలో చురుగ్గా పాల్గొన్నారు. మహబూబ్‌నగర్‌లో జరిగే అన్ని ఉద్యమాలకు ఇతను నాయకత్వం వహించారు. మహబూబ్‌నగర్ జిల్లాలో ఆంధ్రమహాసభను పటిష్టం చేయడమే కాకుండా గ్రామగ్రామాన గ్రంథాలయాలు స్థాపించడానికి కృషిచేశారు. 1938 నుంచి 1954 కాలంలో మహబూబ్‌నగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుగా ఉన్నారు. 1938-39లో వందేమాతరం ఉద్యమంలోనూ, 1947-48లో నిరంకుశ నిజాం పాలనకు వ్యతిరేకంగా ఉద్యమం చేసి జైలుకు వెళ్ళారు. హైదరాబాదు సంస్థానం భారత యూనియన్‌లో కలిసిన పిమ్మట 1948, సెప్టెంబరు 19న ఇతను జైలు నుంచి విడుదలైనారు. 1952లో జరిగిన తొలి శాసనసభ ఎన్నికలలో మహబూబ్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి హైదరాబాదు రాష్ట్ర శాసనసభకు ఎన్నికై బూర్గుల రామకృష్ణారావు మంత్రివర్గంలో స్థానం పొందినారు. ఇతన్ని దక్కన్ గాంధీ, మహబూబ్‌నగర్ గాంధీ అని ప్రజలు అప్యాయంగా పిలిచేవారు. 1956లో వినోబాభావే చేపట్టిన భూదానోద్యమంలో జిల్లా నుంచి 50వేల ఎకరాల భూమిని సేకరించి ఘనతచెందారు. తెలంగాణ కేసరిగానూ ప్రసిద్ధి చెందిన పల్లెర్ల హన్మంతరావు మహబూబ్‌నగర్ లోకసభ స్థానాన్ని రాజా రామేశ్వరరావు కోసం త్యాగం చేసి మెదక్ నుంచి 1957 మరియు 1962లలో లోకసభకు ఎన్నికయ్యారు. 1957లో మెదక్ నుంచి హన్మంతరావుపై పోటీచేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. చివరికి మఖ్దూంమొహియుద్దీన్ పోటీచేశారు. వీరిరువురూ కలిసే భోజనాలు చేయడం, ఒకే వేదికపై నుంచి ప్రసంగించడం ప్రజలను విస్మయపర్చింది. పోటీ ఎన్నికలలో కాని మా మధ్య వ్యక్తిగత వైషమ్యాలు లేవని చెప్పేవారు. 1965లో హన్మంతరావు నెలకొల్పిన ఎం.వి.ఎస్.డిగ్రీ కళాశాల ఇప్పటికీ విద్యాకుసుమాలు వెదజల్లుతూనే ఉంది. 1967లో స్వచ్ఛందంగా ప్రత్యక్ష రాజకీయాలల నుంచి వైగొలిగినప్పుడు వీరి కుమారుడు పల్లెర్ల వినాయకరావును రాజకీయ వారసుడిగా ప్రకటించమని పలువురి కోరినప్పుడు "నేనలా ప్రకటించను, అతను స్వయంగా పైకి రావాల్సిందే"నని ప్రకటించిన నిష్పక్షపాతి హన్మంతరావు. 1972లో భారత ప్రభుత్వంచే స్వాతంత్ర్య సమరయోధులకు ప్రధానం చేసే తామ్రపత్రాన్ని స్వీకరించారు. 1979,సెప్టెంబరు 19న 71 సంవత్సరాల వయస్సులో పల్లెర్ల హన్మంతరావు మరణించారు. వీరి సేవలకు గుర్తింపుగా 2009 మేలో హన్మంతరావు శతజయంతి సందర్భంగా మహబూబ్‌నగర్ పట్టణంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల కూడలిలో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు.

విభాగాలు: మహబూబ్‌నగర్ జిల్లా రాజకీయ నాయకులు,    మహబూబ్‌నగర్ జిల్లా సమరయోధులు,  మహబూబ్‌నగర్ మండలము, మహబూబ్‌నగర్ పట్టణంమహబూబ్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం,

= = = = =
ఉపయుక్త గ్రంథాలు, వెబ్‌సైట్లు:
 • తెలుగు వికీపీడియా,
 • ఆంగ్ల వికీపీడియా,
 • మహబూబ్‌నగర్ జిల్లా అజ్ఞాత విషయములు (రచన- పల్లెర్ల జానకిరామశర్మ),
 • మహబూబ్‌నగర్ జిల్లా సర్వస్వము (రచన- బి.ఎన్.శాస్త్రి), 
 • దక్కన్ గాంధీ (పల్లెర్ల హన్మంతరావు శతజయంతి సంచిక),
 • బ్లాగు నిర్వాహకులు పల్లెర్ల రామ్మోహనరావు గారితో సంప్రదించి సేకరించిన విషయాలు,

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక