23, జనవరి 2013, బుధవారం

వనపర్తి అసెంబ్లీ నియోజకవర్గం (Wanaparthy Assembly Constituency)

మహబూబ్ నగర్ జిల్లా లోని 14 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఇది ఒకటి. 2007లో చేయబడిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రకారము ఈ నియోజకవర్గం 5 మండలాలు కలవు. పునర్విభజనలో భాగంగా నాగర్‌కర్నూల్ నియోజకవర్గం నుంచి గోపాల్‌పేట మండలం, ఆలంపూర్ నియోజకవర్గం నుంచి పెబ్బేరు మండలాలు కొత్తగా ఈ నియోజకవర్గంలో వచ్చిచేరాయి. గతంలో పాక్షికంగా ఉన్న అడ్డాకల్, భూత్పూర్, దేవరకద్ర మండలాలు కొత్తగా ఏర్పడిన దేవరకద్ర నియోజకవర్గంకు తరలించారు. చరిత్రలో తెలంగాణ వైతాళికుడుగా పేరుగాంచిన సురవరం ప్రతాపరెడ్డి 1952లో ఈ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. జిల్లెల చిన్నారెడ్డి ఇక్కడి నుంచి 4 సార్లు విజయం సాధించారు.

ఈ నియోజకవర్గం పరిధిలోని మండలాలు

నియోజకవర్గ భౌగోళిక సమాచారం
భౌగోళికంగా మహబూబ్‌నగర్ జిల్లాలో మధ్యగా ఉన్న ఈ నియోజకవర్గం తూర్పున నాగర్‌కర్నూల్ నియోజకవర్గం మరియు కొల్లాపూర్ నియోజకవర్గాలతో సరిహద్దును కలిగి ఉండగా, పశ్చిమాన మరియు ఉత్తరాన దేవరకద్ర నియోజకవర్గం సరిహద్దుగా ఉన్నది. దక్షిణాన కొంతభాగం ఆలంపూర్ నియోజకవర్గం సరిహద్దుగా ఉంది. నియోజకవర్గంలోని పెద్దమండలి మండలంలోని కొంతభాగం మరియు పెబ్బేరు మండలం గుండా 44వ నెంబరు జాతీయ రహదారి వెళ్ళుచున్నది.

ఎన్నికైన శాసనసభ్యులు
సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ
1952 సురవరం ప్రతాపరెడ్డి కాంగ్రెస్ పార్టీ రామచంద్రారెడ్డి స్వతంత్ర అభ్యర్ధి
1952 (ఉ) ఎం.ఆర్.రెడ్డి పి.ఎస్.పి జయరామ్ కాంగ్రెస్ పార్టీ
1957 పద్మనాభరెడ్డి కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవ ఎన్నిక
1962 జె.కుముదినీ దేవి కాంగ్రెస్ పార్టీ జి.ఎస్.రెడ్డి స్వతంత్ర అభ్యర్థి
1967 జె.కుముదినీ దేవి కాంగ్రెస్ పార్టీ ఎం.జగన్నాథరెడ్డి స్వతంత్ర అభ్యర్థి
1972 అయ్యప్ప కాంగ్రెస్ పార్టీ ఏ.బాలకృష్ణయ్య స్వతంత్ర అభ్యర్థి
1978 ఎం.జయరాములు ఇందిరా కాంగ్రెస్ ఏ.బాలకృష్ణయ్య జనతా పార్టీ
1983 ఏ.బాలకృష్ణయ్య తెలుగుదేశం పార్టీ జయరాములు కాంగ్రెస్
1985 ఏ.బాలకృష్ణయ్య తెలుగుదేశం పార్టీ జి.చిన్నారెడ్డి కాంగ్రెస్
1989 జిల్లెల చిన్నారెడ్డి కాంగ్రెస్ పార్టీ ఏ.బాలకృష్ణయ్య తెలుగుదేశం పార్టీ
1994 రావుల చంద్రశేఖర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ జి.చిన్నారెడ్డి కాంగ్రెస్ పార్టీ
1999 జి.చిన్నారెడ్డి కాంగ్రెస్ పార్టీ రావుల చంద్రశేఖర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ
2004 జి.చిన్నారెడ్డి కాంగ్రెస్ పార్టీ కందూర్ లావణ్య తెలుగుదేశం పార్టీ
2009 రావుల చంద్రశేఖర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ జి.చిన్నారెడ్డి కాంగ్రెస్ పార్టీ
2014 జిల్లెల చిన్నారెడ్డి కాంగ్రెస్ పార్టీ నిరంజన్ రెడ్డి తెరాస
2018 నిరంజన్ రెడ్డి తెరాస జిల్లెల చిన్నారెడ్డి కాంగ్రెస్ పార్టీ

1999 ఎన్నికలు
1999లో జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జి.చిన్నారెడ్డి తన సమీప ప్రత్యర్థి అయిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రావుల చంద్రశేఖర్ రెడ్డిపై 3353 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. చిన్నారెడ్డికి 65286 ఓట్లు రాగా, రావుల చంద్రశేఖర్ రెడ్డి 61933 ఓట్లు సాధించారు.

2004 ఎన్నికలు
2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో వనపర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జి.చిన్నారెడ్డి తన సమీప ప్రత్యర్థి అయిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కందూర్ లావణ్యపై 3975 ఓట్ల మెజారిటీతో గెలుపొందినారు. చిన్నారెడ్డి 64239 ఓట్లు సాధించగా, లావణ్యకు 60264 ఓట్లు లభించాయి. మొత్తం 5 గురు అభ్యర్థులు పోటీచేయగా ప్రధానపోటీ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీల మధ్యనే కొనసాగింది. ఈ రెండు పార్టీల అభ్యర్థులు కలిపి మొత్తం పోలైన ఓట్లలో 95.9% ఓట్లు సాధించారు. బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థితో సహా మరో ఇద్దరు ఇండిపెండెంట్ అభ్యర్థులు డిపాజిట్ కోల్పోయారు.

2009 ఎన్నికలు
2009 శాసనసభ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రావుల చంద్రశేఖర్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన చిన్నారెడ్డిపై 10529 ఓట్ల మెజారిటితో విజయం సాధించారు.

2014 ఎన్నికలు:
2014 ఎన్నికలలో ఇక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన జిల్లెల చిన్నారెడ్డి తన సమీప ప్రత్యర్థి, తెరాసకు చెందిన నిరంజన్ రెడ్డీపై 4291 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

2018 ఎన్నికలు:
2018 శాసనసభ ఎన్నికలలో తెరాస తరఫున ఎస్.నిరంజన్ రెడ్డి, భాజపా తరఫున కొత్త అమరేందర్ రెడ్డి, ప్రజాకూటమి తరఫున కాంగ్రెస్ పార్టీకి చెందిన జి.చిన్నారెడ్డి పోటీచేశారు. తెరాసకు చెందిన సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన జిల్లెల చిన్నారెడ్డి పై 51685 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

నియోజకవర్గ ప్రముఖులు



హోం,
విభాగాలు:
మహబూబ్‌నగర్ జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాలు,  నాగర్‌కర్నూల్ లోకసభ నియోజకవర్గం,  వనపర్తి అసెంబ్లీ నియోజకవర్గం,  తెలంగాణ అసెంబ్లీ నియోజకవర్గాలు, వనపర్తి,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక