ప్రస్తుత పదవి | ఆప్కాబ్ చైర్మెన్ |
జిల్లా | మహబూబ్ నగర్ |
నిర్వహించిన పదవులు | శాసనసభ్యుడు, డిసిసి అధ్యక్షుడు, డీసిసిబి అధ్యక్షుడు, శాసనసభ విప్, |
కె.వీరారెడ్డి పాలమూరు జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు. 2013 ఫిబ్రవరిలో రాష్ట్ర ఆప్కాబ్ పదవి పొందిన వీరారెడ్డి పాలమురు జిల్లా ధన్వాడ మండలమునకు చెందినవారు. అమరచింత నియోజకవర్గం నుంచి రెండు సార్లు శాసనసభకు ఎన్నికకావడమే కాకుండా, శాసనసభ విప్ గా, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా, డీసిసిబి చైర్మెన్ గానూ పనిచేశారు.
రాజకీయ నేపథ్యం:
వీరారెడ్డి విద్యార్థి దశలో ఉన్నప్పుడే 1973లో రాజకీయాలలో ప్రవేశించారు. 1976లో జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులైనారు. 1978లో తొలిసారి అమరచింత నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసి మాజి సంస్థానాధీశుడైన రాజా సోంభూపాల్ పై విజయం సాధించారు. 1983లో జిల్లా కాంగ్రెస్ కమిటి అధ్యక్షులుగా కొంతకాలం పనిచేశారు. 1983లో ఓటమి పొందినారు. 1989లో విజయం సాధించి రెండోసారి శాసనసభలో ప్రవేశించారు. 1989-94వరకు శాసనసభ విప్ గా వ్యవహరించారు. 1994లో పార్టీ టికెట్టు లభించకపోవడంతో తిరుగుబాటు అభ్యర్థిగా పోటీచేసి 22 వేలకు పైగా ఓట్లు సాధించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఓటమికి కారకులైనారు. దీనితో పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు. ఆ తర్వాత మాజీ కేంద్ర మంత్రి మల్లికార్జున్ చొరవతో మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 1999లో మరోసారి అమరచింత నుంచి పోటీచేసిననూ విజయం లభించలేదు. 2004లో అమరచింతలో పార్టీ అభ్యర్థి స్వర్ణసుధాకర్ రెడ్డి విజయానికి కృషిచేశారు. ఆ తర్వాత డిసిసిబి చైర్మెన్ పదవి పొందడమే కాకుండా ఆప్కాబ్ డైరెక్టర్గానూ ఎన్నికయ్యారు. 2012లోనూ రెండోసారి కూడా డిసిసిబి చైర్మెన్ పదవి పొంది ఈ సారి ఏకంగా చైర్మెన్ పదవి పొందారు. జిల్లా నుంచి ఈ పదవి పొందిన వారిలో ఇతను ప్రథముడు.
వ్యక్తిగత జీవనం:
కె.వీరారెడ్డి మహబూబ్ నగర్ జిల్లా ధన్వాడ మండలం తీలేరు గ్రామానికి చెందినవారు. వీరారెడ్డి తండ్రి వెంకారెడ్డి 3 దశబ్దాలు తీలేరు గ్రామ సర్పంచిగా పనిచేశారు.

విభాగాలు: మహబూబ్‌నగర్ జిల్లా రాజకీయ నాయకులు, ధన్వాడ మండలము, అమరచింత అసెంబ్లీ నియోజకవర్గం, |
= = = = =
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి