22, ఫిబ్రవరి 2013, శుక్రవారం

డి.కె.సమరసింహారెడ్డి (D.K.Samara Simha Reddy)

(డి.కె.సమరసింహారెడ్డి)
చేపట్టిన పదవులురాష్ట్ర మంత్రి
నియోజకవర్గంగద్వాల
ధర్మవరపు కొట్టం సమరసింహారెడ్డి జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకులు. మొదట హైకోర్టు అడ్వకేట్‌గా ఉంటూ 1969లో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. 1972లో రాజకీయ ప్రవేశం చేసి తెలంగాణ ప్రజాసమితి తరఫున రెండాకుల గుర్తుతో పోటీచేసి పాగపుల్లారెడ్డి చేతిలో ఓటమి చెందారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో ప్రవేశించారు. 1980 ఉప ఎన్నికలలో తొలిసారిగా గద్వాల నియోజకవర్గం  నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. 1983లో రెండవసారి విజయం సాధించారు. 1985లో పరాజయం పొందిననూ (1985లో ఓటమి చెందిననూ ఓట్ల లెక్కింపులో తప్పులు జరిగాయని కోర్టును ఆశ్రయించి తనకనుకూలంగా తీర్పు పొందారు. అయితే అది గడిచే సరికి 1989 ఎన్నికలు సమీపించాయి.) 1989లో మళ్ళీ విజయం సాధించి మూడవసారి ఎమ్మెల్యే అయ్యారు. మర్రిచెన్నారెడ్డి, కోట్ల విజయభాస్కర్‌రెడ్డి, నేదురమల్లి జనార్ధన్‌రెడ్డి కేబినేట్‌లో మంత్రి పదవులను పొందారు. సోదరుల మద్య ఆధిపత్య పోరులో 1994లో సోదరుడు డి.కె.భరత సింహారెడ్డి చేతిలో ఓడిపోయారు. 1999లో పార్టీ టికెట్టు వదిన డి.కె.అరుణకు లభించగా ఇతను ఇండిపెండెంటుగా పోటీచేయడంతో చివరికి తెలుగుదేశం అభ్యర్థి విజయం సాధించారు.ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలోనూ, భారతీయ జనతా పార్టీలోనూ కొంత కాలం ఉన్నారు. 2013, జూలై 6న తెలుగుదేశం పార్టీలో చేరారు.

ఒకప్పుడు రాష్ట్ర రాజకీయాలలో నెంబర్ టూగా వ్యవహరించిన సమరసింహారెడ్డి తాత్కాలిక ముఖ్యమంత్రిగానూ పనిచేశారు. 1989లో అప్పటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి అనారోగ్యరీత్యా వైద్య పరీక్షకలకై అమెరికా వెళ్ళగా 3 మాసాలపాటు సమరసింహారెడ్డి ముఖ్యమంత్రి విధులు నిర్వహించారు.

డి.కె.కుటుంబం గద్వాల నియోజకవర్గ రాజకీయాలలో పేరిన్నకగన్నది. ఇప్పటి వరకు జరిగిన 14 ఎన్నికలలో 9 సార్లు ఈ కుటుంబీకులే గెలుపొందినారు. 1957, 1978లలో సమర సింహారెడ్డీ తండ్రి డి.కె.సత్యారెడ్డి విజయం సాధించగా, 1980, 1983, 1985, 1989లలో సమరసింహారెడ్డి గెలుపొందినారు. వీరు రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం కూడా పొందినారు. 1994లో సమరసింహారెడ్డి సోదరుడు డి.కె.భరత సింహారెడ్డి ఎన్నికయ్యారు. 2004, 2009లలో సమరసింహారెడ్డి మరదలు (భరత సింహారెడ్డి భార్య) విజయం సాధించి 2009 తర్వాత మంత్రిగా పనిచేశారు.


విభాగాలు: జోగులాంబ గద్వాల జిల్లా రాజకీయ నాయకులు,  గద్వాల మండలము,  గద్వాల అసెంబ్లీ నియోజకవర్గం,   

= = = = =

2 వ్యాఖ్యలు:

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక