షాద్ నగర్ మండలం మొగలిగిద్ద గ్రామానికి చెందిన మొగలిగిద్ద శ్రీనివాసరావు పాలమూరు జిల్లాకు చెందిన ప్రముఖ విమోచనోద్యమకారుడు మరియు రాజకీయ నాయకుడు. 1947-48లో నిరంకుశ నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడి ఏడాది పాటు రాజమండ్రి జైలులో శిక్ష అనుభవించారు. తెలంగాణ రైతాంగ పోరాటంలోనూ పాల్గొని ఆ తర్వాత ఉభయ కమ్యూనిస్టు పార్టి జిల్లా కార్యదర్శిగా పనిచేశారు. 1964లో కమ్యూనిస్టు పార్టీలో చీలిక అనంతరం సీపీఎంలో చేరారు. ఆ తర్వాత పి.వి.నరసింహారావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 1978లో ఇందిరా కాంగ్రెస్ తరఫున పోటీచేసి నాగర్ కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపొంది 1980లో టంగుటూరి అంజయ్య మంత్రివర్గంలో విద్యాశాఖ మంత్రిగా వ్యవహరించారు. ఆయన మంత్రిగా ఉన్న కాలంలోనే నాగర్ కర్నూల్ పట్టణంలో ఆర్టీసీ డీపో మరియు బస్టాండు ఏర్పాటైనాయి. రామచంద్రారావు 1981-82 కాలంలో మార్క్ ఫెడ్ చైర్మెన్ గా పనిచేశారు. 82 సంవత్సరాల వయస్సులో డిసెంబరు 1, 2010న రామచంద్రారావు మరణించారు.
విభాగాలు: మహబూబ్‌నగర్ జిల్లా సమరయోధులు, మహబూబ్‌నగర్ జిల్లా రాజకీయ నాయకులు, నాగర్‌కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గం, షాద్‌నగర్ మండలం, |
= = = = =
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి