1918లో మహబూబ్ నగర్ లో జన్మించిన ఏగూరు చెన్నప్ప స్వాతంత్ర్య సమరయోధుడు మరియు రాజకీయ నాయకుడు. 1938లో వందేమాతరం ఉద్యమంలో పాల్గొని జైలుశిక్ష అనుభవించారు. హైదరాబాదు విమోచనొద్యమంలో కూడా పాల్గొని 1947 సెప్టెంబరు నుంచి 1948 ఏప్రిల్ వరకు జైలుశిక్ష పొందారు. ఆ తర్వాత మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ కార్యదర్శిగా, జిల్లా ఉపాధ్యక్షులుగా పనిచేశారు. 1956-59 కాలంలో ఆంధ్రప్రదేశ్ ఖాదీ వికాస్ బోర్డు సభ్యులుగా పనిచేశారు. 1957లో మహబూబ్ నగర్ నుంచి శాసనసభకు పోటీచేసి విజయం సాధించారు. 1972 నవంబరు 1న భారత ప్రభుత్వంచే తామ్రపత్రాన్ని పొందారు.
విభాగాలు: మహబూబ్‌నగర్ జిల్లా సమరయోధులు, మహబూబ్‌నగర్ జిల్లా రాజకీయ నాయకులు, మహబూబ్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం, |
= = = = =
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి