10, ఫిబ్రవరి 2013, ఆదివారం

ఎల్కోటి ఎల్లారెడ్డి (Yelkoti Yella Reddy)

ఎల్కోటి ఎల్లారెడ్డి పాలమూరు జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు. 1939 అక్టోబరు 1న జన్మించిన ఎల్లారెడ్డి స్వగ్రామం ఉట్కూరు. పీయూసి వరకు విద్య అభ్యసించి 1960లో రాజకీయాలలో ప్రవేశించారు. వార్డు మెంబరుగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించి అంచెలంచెలుగా ఎదుగుతూ సర్పంచిగా, సమితి అధ్యక్షుడిగా, సింగిల్ విండో చైర్మెన్ గా, శాసనసభ్యుడిగా, రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. 2015, జనవరి 20న ఎల్లారెడ్డి మరణించారు.

రాజకీయ నేపథ్యం:
ఎల్లారెడ్డి 1960లో రాజకీయాలలో ప్రవేశించారు. 1969 నుంచి 1981 వరకు ఉట్కూరు గ్రామపంచాయతి వార్డు సభ్యునిగా, గ్రామ సర్పంచిగా పనిచేశారు. 1981లో మక్తల్ సమితి అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. అదే కాలంలో సింగిల్ విండో చైర్మెన్ గానూ పనిచేశారు. 1983లో జనతాదళ్ పార్టీ తరఫున మక్తల్ నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓడిపోయారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరి 1994లో ఆ పార్టీ తరఫున పోటీచేసి తొలిసారి శాసనసభలో ప్రవేశించారు. 1996లో చంద్రబాబు మంత్రివర్గంలో కేబినెట్ హోదా మంత్రిపదవి (మార్కెటింగ్ శాఖ) లభించింది. 1999లో అదే స్థానం నుంచి వరసగా రెండో సారి ఎన్నికయ్యారు. 2004లో మహబూబ్ నగర్ లోకసభ స్థానం నుంచి పోటీచేసి పరాజయం పొందినారు. 2009లో కొత్తగా ఏర్పడిన నారాయణపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేసి కాంగ్రెస్ పార్టీకి చెందిన సూగప్పపై గెలుపొంది మూడవ సారి ఎమ్మెల్యే అయ్యారు.

విభాగాలు: మహబూబ్‌నగర్ జిల్లా రాజకీయ నాయకులు,  ఉట్కూరు మండలము, మక్తల్ అసెంబ్లీ నియోజకవర్గంనారాయణపేట అసెంబ్లీ నియోజకవర్గం, 13వ శాసనసభ సభ్యులు, 1939లో జన్మించినవారు, 2015లో మరణించినవారు,

= = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక