14, మార్చి 2013, గురువారం

చిట్టెం నర్సిరెడ్డి (Chittem Narsireddy)

చిట్టెం నర్సిరెడ్డి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు. ధన్వాడ గ్రామానికి చెందిన నర్సిరెడ్డి 1985లో తొలిసారిగా జనతాదళ్ తరఫున మక్తల్ నియోజకవర్గం నుంచి శాసనసభకు ఎన్నికైనారు. 1989లోనూ జనతాదళ్ తరఫున రెండోసారి విజయం సాధించారు. 1999లలో ఓటమి చెందారు. 2004లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసి మూడవసారి గెలుపొందినారు. మక్తల్ ఎమ్మెల్యేగా ఉంటూ అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన సమయంలో 2005 ఆగస్టు 15న నారాయణపేటలో మావోయిస్టుల దాడికి గురై ప్రాణాలు కోల్పోయాడు. నర్సిరెడ్డి మరణానంతరం మక్తల్ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలలో ఆయన కుమారుడు చిట్టెం రామ్మోహన్ రెడ్డి విజయం సాధించారు. నర్సిరెడ్డి కూతురు డి.కె.అరుణ గద్వాల నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించడమే కాకుండా 2009 నుంచి రాష్ట్రమంత్రివర్గంలో ఉన్నది. నర్సిరెడ్డి సేవలకు గుర్తుగా సంగంబండ రిజర్వాయరుకు ఆయనపేరు పెట్టబడింది. అలాగే స్వగ్రామం ధన్వాడలో కూడలికి చిట్టెం నర్సిరెడ్డి చౌరస్తాగా పేరుపెట్టబడింది. నర్సిరెడ్డి జిల్లాకు చెందిన ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు. శాసనసభ ప్యానెల్ స్పీకరుగా కూడా పనిచేశారు.

విభాగాలు: మహబూబ్‌నగర్ జిల్లా సమరయోధులుమహబూబ్‌నగర్ జిల్లా రాజకీయ నాయకులు, ధన్వాడ మండలము,  మక్తల్ అసెంబ్లీ నియోజకవర్గం

= = = = =

1 వ్యాఖ్య:

 1. thankyou. cck rao garu naa mandalamlo putti perigina inni vishayalanu yevvaru aadigina clearga cheppaledu. so mothham samacharani okachota unchi maku gnanani echhina maku naaa abhinandanalu.alagey meeru ee blogspot enkaa nadipinchalani korukuntunnanu

  ప్రత్యుత్తరంతొలగించు

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక