14, మార్చి 2013, గురువారం

కపిలవాయి లింగమూర్తి (Kapilavai Lingamurthy)

 కపిలవాయి లింగమూర్తి
జననంమార్చి 31, 1928
జన్మస్థానంజినుకుంట
రంగంసాహితీవేత్త
వెబ్‌సైటుkapilavailingamurthy.com
కపిలవాయి లింగమూర్తి నాగర్‌కర్నూల్ జిల్లా చెందిన కవులలో ప్రముఖులు. మార్చి 31, 1928న బల్మూరు మండలం జినుకుంటలో జన్మించిన లింగమూర్తి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఎం.ఏ (తెలుగు) పట్టా పొంది 1954లో నాగర్ కర్నూల్ జాతీయ పాఠశాలలో తెలుగు పండితునిగా చేరారు. ఆ తర్వాత పాలెం శ్రీవేంకటేశ్వర ప్రాచ్య కళాశాల ఉపన్యాసకులుగా పనిచేసి 1983 ఫిబ్రవరిలో ఉద్యోగవిరమణ పొందారు. పలుగ్రంథాలు, పరిశోధనలు రచించి సాహితీవేత్తగా పేరుపొందారు.

రచనలు:
తెలంగాణలోనే ప్రముఖ సాహితీవేత్తగా పేరుగాంచిన కపిలవాయి  చిన్నతనంలోనే కవితారచనకు పూనుకున్నారు.  ఇప్పటివరకు 60కిపైగా గ్రంథాలు రచించారు. వీటితోపాటు పద్యాలు, గేయాలు, కవితలు, కావ్యాలు అనేకంగా రచించారు. లింగమూర్తి రచించిన ప్రముఖ రచనలలో పాలమూరు జిల్లా దేవాలయాలు, సాలగ్రామ శాస్త్రం, శ్రీ మత్ప్రతాపగిరి ఖండం, మాంగళ్య శాస్త్రం, ఆర్యా శతకం ప్రముఖమైనవి.

గుర్తింపులు:
సాహితీరంగంలో కపిలవాయి చేసిన కృషికిగాను జిల్లా మరియు రాష్ట్ర స్థాయిలో అనేక అవార్డులు, గుర్తింపులు లభించాయి. ఎన్టీరామారావు మరియు వైఎస్ రాజశేఖర్ రెడ్డిలు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఉగాది ఉత్సవాలలో భాగంగా రాష్ట్రస్థాయి ఉత్తమ పండిత పరిశోధన అవార్డు పొందినారు. 2014 ఆగస్టులో తెలుగు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ప్రకటించింది.


విభాగాలు: నాగర్‌కర్నూల్ జిల్లా రచయితలు, బల్మూరు మండలము,  బిజినేపల్లి మండలము, 1928లో జన్మించినవారు, 

= = = = =

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక