వి.ఎన్.గౌడ్ నవంబరు 5, 1925 నాడు జన్మించారు. ఇతని పూర్తిపేరు వంగా నారాయణగౌడ్, స్వగ్రామం నాగర్ కర్నూల్ మండలం ఎండమెట్ట గ్రామం. 1953లో ఎండమెట్ట గ్రామసర్పంచిగా పనిచేసి ఆ తర్వాత 1954లో అప్పటి నాగర్‌కర్నూల్ మున్సిపల్ చైర్మన్‌గా ఎన్నికై 1956 నుంచి 67 వరకు బిజినేపల్లి సమితి అధ్యక్షుడిగా పని చేశారు. 1967లో నాగర్ కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంటుగా పోటీచేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తర్వాత ఆయన కాంగ్రెస్‌లో చేరారు. 1972లో రెండోసారి విజయం సాధించిననూ 1978లో ఓటమి చెందారు. 1981లో ఆయన జిల్లా పరిషత్ అధ్యక్షుడిగా ఎన్నికై రెండేళ్ళు ఆ పదవీలో కొనసాగారు. 1983లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసి మూడవసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1985 లో నాగం జనార్థన్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. నాగర్‌కర్నూల్ లోకసభ నియోజకవర్గం నుంచి మల్లు అనంతరాములు ఎంపిగా గెలువడంతో విఎన్‌గౌడ్ కీలకమైన పాత్ర వహించారు. సామాజిక కార్యక్రమాల్లో కూడా ఆయన చురుగ్గా పాల్గొన్నారు. నాగర్ కర్నూల్ లోఉంటూ ఫిబ్రవరి 14, 2010 న మరణించారు. వి.ఎన్.గౌడ్ తండ్రి పకీరయ్య గౌడ్ గ్రామంలో గొప్ప దానకర్ణుడిగా పేరుపొందారు.కుమ్మెరలో మల్లయ్య గట్టుకు మెట్లు కట్టించడం, సిర్సనగండ్లలో మెట్లు కట్టించడం, ఆవరనంలో బండలు పర్చడం, పుష్కరిణి నిర్మాణం చేయడం లాంటి ఎన్నో ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టారు.
వీఎన్ గౌడ్ కుమారుడు వంగా మోహన్ గౌడ్ 1989లో శాసనసభకు ఎన్నికయ్యారు. ఈయన 1981-89 కాలంలో నాగర్‌కర్నూల్ సర్పంచిగా పనిచేశారు.
వీఎన్ గౌడ్ కుమారుడు వంగా మోహన్ గౌడ్ 1989లో శాసనసభకు ఎన్నికయ్యారు. ఈయన 1981-89 కాలంలో నాగర్‌కర్నూల్ సర్పంచిగా పనిచేశారు.
విభాగాలు: మహబూబ్‌నగర్ జిల్లా రాజకీయ నాయకులు, నాగర్‌కర్నూల్ మండలము, నాగర్‌కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గం, |
= = = = =
సంప్రదించిన గ్రంథాలు, వెబ్ సైట్లు:
- నాగరకర్నూలు తాలుకా గ్రామాలు-చరిత్ర (రచయిత కపిలవాయి కిశోర్ బాబు)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి