19, ఏప్రిల్ 2013, శుక్రవారం

చిన్నదర్పలి (Chinadarpalli)


చిన్నదర్పలి
గ్రామముచిన్నదర్పలి
మండలముహన్వాడ
జిల్లామహబూబ్‌నగర్
జనాభా3507 (2001),
4409 (2011),
గ్రామ కోడ్ సంఖ్య575066
చిన్నదర్పలి మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండలమునకు చెందిన గ్రామము. 2011 లెక్కల ప్రకారము గ్రామ జనాభా 4409. ఈ గ్రామము మహబూబ్‌నగర్ నుంచి 3 కిమీ దూరంలో తాండూరు వెళ్ళు రహదారిపై ఉంది. గ్రామపరిధిలో 228 హెక్టార్ల అటవీ ప్రాంతం ఉంది. ప్రత్యేక పంచాయతీగా ఉన్న ఈ గ్రామాన్ని 2012లో మహబూబ్‌నగర్ పురపాలక సంఘంలో విలీనం చేశారు.

భౌగోళికం, సరిహద్దులు:
చిన్నదర్పల్లి గ్రామం హన్వాడ మండలంలో దక్షిణం వైపున ఉన్నది. ఈ గ్రామానికి దక్షిణాన మరియు తూర్పున మహబూబ్‌నగర్ మండలం సరిదహద్దుగా ఉండగా, ఉత్తరమున కొత్తపేట గ్రామం, పశ్చిమాన పెద్దదర్పల్లి గ్రామాలు సరిహద్దులుగా ఉన్నాయి.

రవాణా సౌకర్యాలు:
మహబూబ్‌నగర్ నుంచి కోస్గి వెళ్ళు ప్రధాన రహదారి గ్రామం మీదుగా వెళ్ళుచున్నది. తాండూరు, పరిగి వెళ్ళు ఆర్టీసి బస్సులే కాకుండా ప్రైవేటు వాహనాలు కూడా అందుబాటులో ఉన్నాయి.

జనాభా:
2001 జనాభా లెక్కల ప్రకారము గ్రామ జనాభా 3507. ఇందులో పురుషులు 1783, మహిళలు 1724. ఇది మండలంలో ఐదవ పెద్ద గ్రామము.
2011 జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 4409. ఇందులో పురుషులు 2240, మహిళలు 2169. గృహాల సంఖ్య 887, అక్షరాస్యత శాతం 43.9%. గ్రామ కోడ్ సంఖ్య 575066.

రాజకీయాలు:

2009 శాసనసభ ఎన్నికలలో ఈ గ్రామం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థి రాజేశ్వర్ రెడ్డికి 82 ఓట్ల మెజారిటి లభించింది.

విద్యాసంస్థలు
గ్రామంలో జిల్లాపరిషత్తు ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాల, ప్రతిభ ప్రైవేట్ మాధ్యమిక పాఠశాలలు ఉన్నాయి. చిర్మల్ కుచ తండా, పూజారి తండాలలో ప్రాథమిక పాఠశాలలున్నాయి.

సంఘటనలు:
  • చిన్నదర్పల్లి మాజీ సర్పంచి మెండె వెంకన్న ఏప్రిల్ 25,2011న మరణించారు. 1983 నుంచి 15 సం.లు సర్పంచిగా పనిచేశారు. హన్వాడ రైతుసేవా సహకార సంఘం అధ్యక్షుడిగా కూడా పనిచేశారు.
విభాగాలు: హన్వాడ మండలములోని గ్రామాలు,  

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక