పాలమూరు జిల్లా అడ్డాకల్ మండలం కందూరులో కల్పవృక్షాల చెంత రామలింగేశ్వరాలయం నెలకొని ఉంది. దక్షిణ భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఆలయ ఆవరణలో 27 కల్పవృక్షాలు ఉండటం ఇక్కడి ప్రత్యేకతగా చెప్పుకుంటారు. కాకతీయుల కాలంలో నిర్మితమైన ఈ ఆలయంలో ప్రతియేటా మార్చి మాసంలో 20 రోజుల పాటు స్వామివారి ఉత్సవాలు, జాతర నిర్వహిస్తారు. ఇక్కడి శివలింగాకృతి క్రమేణ కొద్ది పరిమాణంలో పెరుగుతుందని భక్తులు విశ్వశిస్తారు.
ఆలయ చరిత్ర:
పూర్వం ఓ మహిళ నిత్యం రామలింగేశ్వరస్వామిని దర్శించుకొనేది. ఆమె గర్భందాల్చి గుట్టపైకి ఎక్కలేక స్వామివారితో "గుట్ట ఎక్కలేను ఇక్కడి నుంచే దర్శిస్తాను" అనగా స్వామి "వెనక్కి చూడకుండా వెళ్ళు" అని ఆదేశించినట్లు, స్వామి రథాక్షుడై కిందికి దిగి వస్తుండగా రథచక్రాల శబ్దానికి మహిళ వెనక్కి చూడడంతో రథచక్రాలలో ఒకటి కోనేరుగా, మరోటి శివలింగాకృతిగా మారినట్లు కథనం ప్రచారంలో ఉంది.

విభాగాలు: పాలమూరు జిల్లా దేవాలయాలు, అడ్డాకల్ మండలము, |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి