పాలమూరు జిల్లా గోపాలపేట మండలంలో మున్ననూరులో పురాతనమైన ఆంజనేయస్వామి ఆలయం ఉంది. సుమారు 200 సంవత్సరాల క్రిందట బొబ్బొలి రాజులు విగ్రహం నిరాటంకంగా వెలుగుతూ ఉండటం ఈ ఆలయం ప్రత్యేకత. గోపాలపేట సంస్థానం కాలంలో నిర్మించిన ఈ ఆలయాన్ని అప్పటి సంస్థానాధీశులు కూడా ఆలయ అభివృద్ధికి తోడ్పడ్డారు.1993లో అప్పటి గ్రామ సర్పంచి టి.శేషయ్య సహకారంతో భక్తుల విరాళాలతో ఆలయాన్ని అభివృద్ధిపర్చారు.
సుమారు 2 శతాబ్దాల క్రితం బొబ్బిలి రాజులు ఈ మార్గం ద్వారా యుద్ధానికి వెళుతూ ఈ ఆలయంలో పూజలు చేసి విజయం కోసం మొక్కుకున్నారు.యుద్ధంలో విజయం చేకూరడంతో తిరుగు ప్రయాణంలో పూజలు చేసి జ్యోతిని వెలిగించారు. దేవునిపై నమ్మకంతో ఈ జ్యోతి ఆరిపోకుండా ఆముదం నూనెను పంపేవారు. ఆ తర్వాత గ్రామస్థులు, ఆలయ అర్చకులు ఈ జ్యోతిని కాపాడుకుంటూ వస్తున్నారు. ఇది అఖండజ్యోతిగా పేరుపొందింది. దీన్ని ఆలయ గర్భగుడిలో ఉన్న గూటిలో ఇప్పటికీ చూడవచ్చు.
విభాగాలు: పాలమూరు జిల్లా దేవాలయాలు, గోపాలపేట మండలము, |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి