పాలమూరు పట్టణంలో బస్టాండు సమీపంలో ప్రధాన రహదారి ప్రక్కన దినదినాభివృద్ధి చెందుతున్న ఆలయమే రేణుక ఎల్లమ్మ దేవత ఆలయం. లోకాయపల్లి సంస్థానం కాలంలో మూడురాళ్ళ మధ్యన వేపచెట్టు కింద ఉన్న అమ్మవారి విగ్రహం నేడు ప్రధాన ఆలయంగా మారింది. శుక్త, మంగళవారాల్లో భక్తులు అధికసంఖ్యలో వస్తుంటారు.
1975నాటికి కూడా మూడురాళ్ల మధ్య్న ఉన్న విగ్రహాన్ని తొలిగించడానికి అప్పటి కలెక్టరు తొలిగించడానికి ప్రయత్నించగా వెంకటమ్మ భక్తులు సహకారంతో ఉద్యమం చేసింది. ఆ తర్వాత 2002 నాటికి చందాలతో గుడి నిర్మాణం జరిగింది. ఆలయ సమీపంలో కళ్యాణమండపం నిర్మాణానికి మాజీ మంత్రి చంద్రశేఖర్ ఆర్థిక సహాయం అందజేశారు.
విభాగాలు: పాలమూరు జిల్లా దేవాలయాలు, మహబూబ్‌నగర్ మండలము, |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి