అమిస్తాపూర్ మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండలమునకు చెందిన గ్రామము. ఈ గ్రామము జిల్లా కేంద్రమైన మహబూబ్ నగర్ మరియు మండల కేంద్రమైన భూత్పూర్ మధ్యలో కలదు. మహబూబ్ నగర్ నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. భూత్పూర్ నుంచి దూరం 3 కిలోమీటర్లు. 2011 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 6669. మండలంలో ఇది పెద్ద గ్రామము. ఈ గ్రామము కంబళ్ళు మరియు ఉన్ని ఉత్పత్తిలో జిల్లాలోనే మంచి పేరు సంపాదించినది. ఇక్కడ ఉన్ని సహకార సంఘం కూడా ఉంది. భౌగోళికం, సరిహద్దులు: అమిస్తాపూర్ గ్రామం మండలంలో భౌగోళికంగా ఉత్తరం వైపున మహబూబ్‌నగర్ మండలం సరిహద్దులో ఉన్నది. ఈ గ్రామానికి తూర్పున భూత్పూర్ గ్రామం, దక్షిణాన పోతులమడుగు, పశ్చిమాన హస్నాపూర్ గ్రామం సరిహద్దుగా ఉండగా, ఉత్తరాన మహబుబ్‌నగర్ మండలం సరిహద్దుగా ఉన్నది. జనాభా: 2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 5695. ఇందులో పురుషులు 2809, మహిళలు 2886. గృహాల సంఖ్య 1116. ఈ గ్రామము మండలంలోనే అతిపెద్ద గ్రామము. 2011 గణన ప్రకారం గ్రామ జనాభా 6669. ఇందులో పురుషులు 3297, మహిళలు 3372. గృహాల సంఖ్య 1400. అక్షరాస్యత శాతం 50.53%. గ్రామ కోడ్ సంఖ్య 575542. రవాణా సౌకర్యాలు: ఈ గ్రామం జిల్లా కేంద్రం మహబూబ్‌నగర్ మరియు మండల కేంద్రం భూత్పూర్ మధ్యలో రెండింటికి సుమారు 4 కిమీ చొప్పున అతిసమీపంలో ఉన్నది. బస్సులు మరియు ప్రైవేటు వాహనాలు విరివిగా అందుబాటులో ఉన్నాయి. 4 కిమీ దూరంలో ఉన్న మహబూబ్‌నగర్ రైల్వేస్టేషన్ కూడా గ్రామస్థులకు అందుబాటులో ఉన్నది. చరిత్ర: అమిస్తాపూర్ గ్రామానికి చాలా పురాతనమైన చరిత్ర ఉంది. సమీపంలో ఉన్న భూత్పూర్లో పలు ప్రాచీనమైన దేవాలయాలు, శాసనాలు ఉన్నాయి. ఇక్కడ పలు యుద్ధాలు జరిగాయి. తొలి తెలుగు రామాయణకర్త గోనబుద్ధారెడ్డి భూత్పూర్ కు చెందినవాడు. తొలి తెలుగు కవియిత్రి కుప్పాంబిక కూడా ఈ ప్రాంతానికి చెందినది. కుప్పాంబిక నిర్మింఇన బుద్దేశ్వరాలయం మండలకేంద్రంలో ఉంది. రాజకీయాలు: 2006 సర్పంచి ఎన్నికలలో కె.శ్రీనివాస్ (కాంగ్రెస్ పార్టీ మద్దతు) గెలుపొందినారు. 2013 జూలైలో జరిగిన సర్పంచి ఎన్నికలలో కె.సంగీత విజయం సాధించారు. గ్రామపాలన: అమిస్తాపుర్ గ్రామ పాలన పంచాయతీచే నిర్వహించబడుతుంది. 1956లో పంచాయతి ఏర్పడింది. 1956 నుంచి వరసగా 3 సార్లు వీరస్వామి సర్పంచిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 1979 నుంచి పోటీచేస్తూ విజయం సాధించారు. అలా 42 సంవత్సరాల పాటు ఒకే వ్యక్తి సర్పంచిగా పనిచేశారు. 25 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు తొలిసారి బాధ్యతలు చేపట్టి 2001లో సర్పంచి స్థానం మహిళలకు రిజర్వ్ చేయడంతో ఆయన ప్రత్యక్షంగా పోటీచేయక, చెన్నమ్మను పోటీ చేయించి గెలిపించారు. 2006లో కె.శ్రీనివాస్ సర్పంచిగా విజయం సాధించారు. 2011 ఆగస్టు నుంచి ప్రత్యేక పాలనలోఉండగా 2013 జూలైలో జరిగిన సర్పంచి ఎన్నికలలో కె.సంగీత విజయం సాధించారు. విద్యాసంస్థలు: గ్రామంలో ఒకమండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల, ఒక ఉర్దూమీడియం మండలపరిషత్తు ప్రాథమిక పాఠశాల, ఒక మండల పరిషత్తు ప్రాథమికోన్నత పాఠశాల, ఒక ప్రైవేట్ పాఠశాల (దయానంద విద్యామందిర్) ఉన్నాయి. అనుబంధ గ్రామాలైన సిద్దాయిపల్లి, రాందాస్ తండా, వాసురాంతండా, నల్లగుట్టతండాలలో మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాలలు కలవు. కాలరేఖ:
= = = = =
సంప్రదించిన గ్రంథాలు, వెబ్సైట్లు:
|
5, మే 2013, ఆదివారం
అమిస్తాపూర్ (Amistapur)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి