తెలుగు సినిమాపై పరిశోధన చేసి సినిమా గ్రంథాలు రచించి రెండు సార్లు నంది అవార్డు పొందిన బులేమోని వెంకటేశ్వర్లు ఆమనగల్ మండలం చారకొండకు చెందినవారు. ఇతను మే 8, 1973న జన్మించి స్థానికంగా చారకొండలో విద్యాభాసం చేశారు. ఉన్నత విద్య హైదరాబాదులో పూర్తిచేసి, జర్నలిజంలో డిప్లోమా చేసి పాత్రికేయుడిగా, వ్యాస రచయితగా, సినీ విమర్శకుడిగా పేరుపొందారు. 1997లో తెలుగు సినిమా రంగంపై పరిశోధన చేసి రచించిన సినిమా చరిత్ర గ్రంథానికి జాతీయ స్థాయిలో పేరులభించింది. నంది అవార్డు కూడా లభించింది. ఇదే గ్రంథానికై ఉత్తమ రచయితగా కళావాహిని అవార్డు కూడా పొందారు. ఈ గ్రంథంలో 100 సం.ల భారతీయ సినిమా, 80 సం.ల తెలుగు సినిమా చరిత్రను వివరించారు. అప్పటి కేంద్రం మంత్రి కృష్ణంరాజుచే గ్రంథాన్ని ఆవిష్కరించారు. తెలుగు సినిమా వైతాళికులు పేరిట వెలువడిన రెండో గ్రంథానికి కూడా నంది అవార్డు లభించింది.
విభాగాలు: మహబూబ్‌నగర్ జిల్లా ప్రముఖులు, ఆమనగల్లు మండలము, |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి