నాగర్‌కర్నూల్ జిల్లా రాజకీయ నేతలలో ఒకరైన చిత్తరంజన్ దాస్ కల్వకుర్తి మండలం ఎలికట్ట గ్రామంలో మే 10, 1950న జన్మించారు. ఈయన కల్వకుర్తి నియోజకవర్గం నుంచి రెండు సార్లు శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. 1989లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావును ఓడించి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించారు. మర్రి చెన్నారెడ్డి, నేదురుమల్లి జనార్థన్ రెడ్డి మంత్రివర్గాలలో స్థానం పొందారు. అంతకు క్రితం 1984లో కూడా ఇదే నియోజకవర్గం నుండి ఎన్నికయ్యారు. 1994లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. 1999లో కాంగ్రెస్ పార్టీ టికెట్టు రాకపోవడంతో తెలుగుదేశం పార్టీలో చేరి కొద్దికాలంలోనే బయటకు వచ్చారు. 2004 మరియు 2009 ఎన్నికలలో కూడా టికెట్టు లభించలేదు.
విభాగాలు: నాగర్‌కర్నూల్ జిల్లా ప్రముఖులు, కల్వకుర్తి మండలం, కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం, |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి