17, మే 2013, శుక్రవారం

సి.లక్ష్మారెడ్డి (C.Laxma Reddy)

సి.లక్ష్మారెడ్డి
జననంఫిబ్రవరి 3, 1962
స్వస్థలంఆవంచ
రంగంరాజకీయాలు
పదవులు2 సార్లు ఎమ్మెల్యే, తెలంగాణ మంత్రి,
చెర్లకోల లక్ష్మారెడ్డి నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజీపేట మండలం ఆవంచ గ్రామానికి చెందినవారు. ఫిబ్రవరి 3, 1962న జన్మించిన లక్ష్మారెడ్డి ఆవంచ గ్రామ సర్పంచితో రాజకీయ ప్రస్థానం ఆరంభించి మండల పరిషత్తు ఉపాధ్యక్షునిగా, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్‌గా పనిచేసి 2004, 2014లలో తెరాస తరఫున జడ్చర్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు.

రాజకీయ ప్రస్థానం:
లక్షారెడ్డి 1988లో ఆవంచ గ్రామ సర్పంచిగా ఎన్నికయ్యారు. మండల పరిషత్తు ఉపాధ్యక్షునిగా పనిచేశారు. 1995లో సహకార సంఘం ఎన్నికలలో ఆవంచ సొసైటి అధ్యక్షుడిగా ఎన్నికై, అదే ఏడాది జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్‌గానూ బాధ్యతలు చేపట్టారు. 2004 ఎన్నికలలో జడ్చర్ల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ మద్దతుతో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తరఫున పోటీచేసి తొలిసారి విజయం సాధించారు. 2008లో తెరాస పార్టీకి చెందిన శాసనసభ్యుల మూకుమ్మడి రాజీనామాల సమయంలో రాజీనామా సమర్పించి ఉపఎన్నికలలో మళ్ళీ పోటీచేసి పరాజయం పొందినారు. 2009 ఎన్నికలలో పోటీచేయాలని ఆశించిననూ మహాకూటమి పొత్తులో భాగంగా ఈ స్థానం తెలుగుదేశం పార్టీకి లభించడంతో పోటీచేయలేరు. 2014 శాసనసభ ఎన్నికలలో జడ్చర్ల నుంచి తెరాస తరఫున పోటీ చేసి రెండోసారి విజయం సాధించారు. డిసెంబరు 16, 2014న తెలంగాణ మంత్రివర్గంలో స్థానం పొందారు.


విభాగాలు: మహబూబ్‌నగర్ జిల్లా రాజకీయ నాయకులు, తిమ్మాజీపేట మండలము,   జడ్చర్ల అసెంబ్లీ నియోజకవర్గం, తెలంగాణ ప్రస్తుత మంత్రులు,

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక