21, మే 2013, మంగళవారం

దువ్వూరి రామిరెడ్డి (Duvvuri Ramireddy)

 దువ్వూరి రామిరెడ్డి
(తెలుగు రచయిత)
జననంనవంబర్ 9, 1895
స్వస్థలంగూడూరు
జిల్లాశ్రీరాములు నెల్లూరు
మరణంసెప్టెంబరు 11,1947
ప్రముఖ రచనలుపానశాల, కృషీవలుడు
ప్రముఖ తెలుగు రచయితగా పేరుపొందిన దువ్వూరి రామిరెడ్డి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, గూడూరులో నవంబర్ 9, 1895 న జన్మించారు. కవికోకిల అని ప్రసిద్ధుడైన తెలుగు కవి. రైతు, కవి అయిన ఇతనిని "సింహపురి సిరి"గా పండితులు కొనియాడారు. 23 సంవత్సరాలనాటికే ఎన్నో రచనలు చేశాడు. స్వయంకృషితోనే అనేక భాషలలో పండితుడయ్యారు. కేవలం కవిగానే కాకుండా గొప్ప విమర్శకులుగా కూడా సమానమైన ఖ్యాతి గడించారు.మధురమైన మాటలు, అతని గంభీరమైన శైలి, అన్నిటికీ మించి రచనా చాతుర్యం చదువరులను ముగ్ధలను చేస్తాయి. నాటక రచయితగా, 'చిత్ర నళీయం' చలనచిత్ర సృష్టికర్తగా బహుముఖ కోణాల్లో ప్రతిభను చాటుకోవడం వల్ల దువ్వూరి పేరు సాహితీ పుటల్లో శాశ్వతస్థానం సంపాదించుకుంది. పానశాల, కృషీవలుడు అతని ప్రముఖ రచనలు. కేవలం 52 సంవత్సరాలు మాత్రమే జీవించి సెప్టెంబరు 11,1947న దువ్వూరి మరణించారు.

ఇవి కూడా చూడండి:



విభాగాలు: తెలుగు రచయితలు, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా, 


 = = = = =




1 కామెంట్‌:

  1. గొప్ప పద్య రచయత . కృషి వలుడు రైతులు ఎంతటి శ్రమజివో ,మనకు తిండి పెట్టడానికి తను ఎండా వానా అనక పడే కష్టం కనుల నీరు తెప్పిస్తుంది . 1978 లో చదివాను .
    nkbabu_nk@yahoo.com

    రిప్లయితొలగించండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక