లైటు ఆంజనేయులు
| |
జననం | జూలై 17, 1943 |
మరణం | 2013, మే 18 |
స్వస్థలం | మహబూబ్‌నగర్ |
పదవులు | ఎమ్మెల్యే (1980-83) |
నియోజకవర్గం | మహబూబ్‌నగర్ అ.ని |
లైటు ఆంజనేయులు మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన రాజకీయనాయకుడు మరియు తెలంగాణ ఉద్యమవాది. ఇతను జూలై 17, 1943న మహబూబ్‌నగర్ పట్టణంలో జన్మించారు. తల్లిదండ్రులు లైటు వెంకన్న, భాగ్యమ్మలు. ఆంజనేయులు పాలమూరు పట్టణంలోనే డిగ్రీవరకు అభ్యసించి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్ర పట్టా పొందారు. విద్యార్థిగా ఉన్నప్పుడే ఉద్యమాలలో పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొని 9 మాసాలు జైలుశిక్ష అనుబవించారు. ఆ తర్వాత రాజకీయాలలో ప్రవేశించి కందూరి రాంరెడ్డి ఆకస్మిక మరణంతో ఖాళి అయిన మహబూబ్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికలలో ఇందిరా కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసి విజయం సాధించారు. ఆ తర్వాత జైపాల్‌రెడ్డితో కలిసి జనతాదళ్‌లో చేరి ఆ పార్టీ జిల్లా అధ్యక్షులుగా పనిచేశారు. 2013, మే 18న మరణించారు.
పాలమూరు పట్టణంలో విద్యుత్ సౌకర్యం లేని రోజులలో ఆంజనేయులు తండ్రి వెంకన్న ప్రధాన కూడళ్ళలో కిరోసిన్ లాంతర్లు పెట్టేవారట. దాంతో అందరూ లైటు వెంకన్న అని పిలవడంతో అదే ఇంటిపేరుగా మారింది.
పాలమూరు పట్టణంలో విద్యుత్ సౌకర్యం లేని రోజులలో ఆంజనేయులు తండ్రి వెంకన్న ప్రధాన కూడళ్ళలో కిరోసిన్ లాంతర్లు పెట్టేవారట. దాంతో అందరూ లైటు వెంకన్న అని పిలవడంతో అదే ఇంటిపేరుగా మారింది.
విభాగాలు: మహబూబ్‌నగర్ జిల్లా రాజకీయ నాయకులు, మహబూబ్‌నగర్ పట్టణం, మహబూబ్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం, |
= = = = =
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి