26, మే 2013, ఆదివారం

దిండి నది (River Dindi)

దిండినది (డిండినది) మహబూబ్‌నగర్ నాగర్‌కర్నూల్ మరియు నల్గొండ జిల్లాలలో ప్రవహిస్తుంది. కృష్ణానదికి ఉపనది అయిన దిండినది మహబూబ్‌నగర్ జిల్లా పురుసంపల్లి కొండలలో జన్మిస్తుంది. ఈ నదిపై నల్గొండ జిల్లాలో దిండి రిజర్వాయర్ నిర్మించబడింది. మహబూబ్‌నగర్ జిల్లాలో, నాగర్‌కర్నూల్ జిల్లాలో ఆ తర్వాత నాగర్‌కర్నూల్, నల్గొండ జిల్లాల సరిహద్దు గుండా ప్రవహించి నాగార్జునసాగర్ వద్ద కృష్ణానదిలో కలుస్తుంది. దిండినదికే దుందుభి నది అని కూడా పిలుస్తారు. దుందుభీ తీరాన నాగర్‌కర్నూల్ జిల్లాలో ఉన్న అతిప్రాచీన క్షేత్రం మామిళ్ళపల్లిని దుందుభీక్షేత్రంగా వ్యవహరిస్తారు. ఈనదికే మీనాంబరం అనే మరొక నామం కూడా ఉంది. గంగాపురం సమీపంలోని ఈ నదితీర క్షేత్రం మీనాంబరంగా ప్రసిద్ధి చెందింది.

దిండినదిపై దిండి ప్రాజెక్ట్‌ను 1942లో నాగర్‌కర్నూల్-నల్గొండ జిల్లాల సరిహద్దులో నిర్మించారు. హైదరాబాదు-శ్రీశైలం ప్రధాన రహదారిపై ఈ  ప్రాజెక్టు ఉంది. 2.4 టీఎంసి నిల్వ సామర్థ్యంతో ప్రాజెక్టు రూపకల్పన చేశారు. కుడి ఎడమ రెండు కాలువలున్నాయి. దాదాపు 20 గ్రామాలకు 12500 ఎకరాలకు ఈ ప్రాజెక్టు ద్వారా సాగునీరు లభిస్తుంది.


విభాగాలు: తెలంగాణ నదులు, మహబూబ్‌నగర్ జిల్లా నదులు, నాగర్‌కర్నూల్ జిల్లా నదులు,  నల్గొండ జిల్లా నదులు
= = = = =
సంప్రదించిన గ్రంథాలు, వెబ్‌సైట్లు:
 • జలవనరులు, సిద్దాని నాగభూషణం రచన, ఆరవ ముద్రణ (2004),
 • మహబూబ్‌నగర్ జిల్లా సర్వస్వము (బీఎన్ శర్మ),

4 వ్యాఖ్యలు:

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక