13, జూన్ 2013, గురువారం

అనంతపురం లోకసభ నియోజకవర్గం (Ananthapuram Loksabha Constituency)

 అనంతపురం లోకసభ నియోజకవర్గం
జిల్లాఅనంతపురం జిల్లా
ప్రస్తుత ఎంపిజె.సి.దివాకర్ రెడ్డి
పార్టీతెలుగుదేశం పార్టీ


ఆంధ్రప్రదేశ్ లోని 42 లోకసభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోకసభ నియోజక వర్గంలో 7 అసెంబ్లీ నియోజక వర్గ సెగ్మెంట్లు ఉన్నాయి. ఈ సెగ్మెంట్లు అన్నీ అనంతపురం జిల్లాకు చెందినవి. నూతనంగా చేసిన పునర్విభజన ప్రకారం ఇది ఎస్టీలకు రిజర్వ్ చేయబడినది. 2014లో జరిగిన 16వ లోకసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీకి చెందిన జె.సి.దివాకర్ రెడ్డి ఎన్నికయ్యారు.

దీని పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలు
  1. రాయదుర్గం అసెంబ్లీ నియోజకవర్గం
  2. ఉరవకొండ అసెంబ్లీ నియోజకవర్గం
  3. గుంతకల్లు అసెంబ్లీ నియోజకవర్గం
  4. తాడిపత్రి అసెంబ్లీ నియోజకవర్గం
  5. సింగనమల అసెంబ్లీ నియోజకవర్గం (ఎస్సీ లకు రిజర్వ్ చేయబడినది)
  6. అనంతపురం అర్బన్ అసెంబ్లీ నియోజకవర్గం
  7. కళ్యాణదుర్గం అసెంబ్లీ నియోజకవర్గం
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు 

లోక్‌సభ పదవీకాలం సభ్యుని పేరు ఎన్నికైన పార్టీ
1వ 1952-57 పైడి లక్ష్మయ్య కాంగ్రెస్ పార్టీ
2వ 1957-62 తరిమెల నాగిరెడ్డి కమ్యూనిష్టు పార్టీ
3వ 1962-67 ఉస్మాన్ అలీ ఖాన్ కాంగ్రెస్ పార్టీ
4వ 1967-71 పి.ఆంటొని రెడ్డి కాంగ్రెస్ పార్టీ
5వ 1971-77 పి.ఆంటొని రెడ్డి కాంగ్రెస్ పార్టీ
6వ 1977-80 దారుర్ పుల్లయ్య కాంగ్రెస్ పార్టీ
7వ 1980-84 దారుర్ పుల్లయ్య కాంగ్రెస్ పార్టీ
8వ 1984-89 డి.నారాయణ స్వామి తెలుగుదేశం పార్టీ
9వ 1989-91 అనంత వెంకట రెడ్డి కాంగ్రెస్ పార్టీ
10వ 1991-96 అనంత వెంకట రెడ్డి కాంగ్రెస్ పార్టీ
11వ 1996-98 అనంత వెంకట రామిరెడ్డి కాంగ్రెస్ పార్టీ
12వ 1998-99 అనంత వెంకట రామిరెడ్డి కాంగ్రెస్ పార్టీ
13వ 1999-04 కలవ శ్రీనివాసులు తెలుగుదేశం పార్టీ
14వ 2004-08 అనంత వెంకట రామిరెడ్డి కాంగ్రెస్ పార్టీ
15వ 2009-14 అనంత వెంకట రామిరెడ్డి కాంగ్రెస్ పార్టీ
16వ 2014- జె.సి.దివాకర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ

2009 ఎన్నికలు
2009 ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థి, సిటింగ్ ఎంపి అయిన  అనంత వెంకటరామిరెడ్డి తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టికి చెందిన కాలువ శ్రీనివాసులుపై 77,921 ఓట్ల మెజారిటితో విజయం సాధించారు. వెంకట్రామిరెడ్డి 457876 ఓట్లు సాధించగా, శ్రీనివాసులు 379955 ఓట్లు పొందారు. ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి మన్సూర్ 3వ స్థానంలో, భారతీయ జనతా పార్టీకి చెందిన ఎ.రామకృష్ణారెడ్డి 4వ స్థానంలో నిలిచారు.


విభాగాలు: అనంతపురం జిల్లా నియోజకవర్గాలు, అనంతపురం లోకసభ నియోజకవర్గం, ఆంధ్రప్రదేశ్ లోకసభ నియోజకవర్గాలు


 = = = = =

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక