13, జూన్ 2013, గురువారం

ఆదిలాబాదు లోకసభ నియోజకవర్గం (Adilabad Loksabha Constituency)

 ఆదిలాబాదు లోకసభ నియోజకవర్గం
జిల్లాఆదిలాబాదు జిల్లా
ప్రస్తుత ఎంపిసోయం బాపూరావు
పార్టీభారతీయ జనతాపార్టీ


తెలంగాణలోని 17 లోకసభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోకసభ నియోజక వర్గంలో ఉమ్మడి ఆదిలాబాదు జిల్లాకు చెందిన 7 అసెంబ్లీ నియోజక వర్గ సెగ్మెంట్లు ఉన్నాయి. ఈ సెగ్మెంట్లు అన్నీ ఉమ్మడి ఆదిలాబాదు జిల్లాకు చెందినవి. నూతనంగా చేసిన పునర్విభజన ప్రకారం ఇది ఎస్టీలకు రిజర్వ్ చేయబడినది. 2019లో జరిగిన 17వ లోకసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి భారతీయ జనతాపార్టీకి చెందిన సోయం బాపూరావు ఎన్నికయ్యారు.

దీని పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలు
  1. సిర్పూర్ అసెంబ్లీ నియోజకవర్గం,
  2. ఆసిఫాబాదు అసెంబ్లీ నియోజకవర్గం, (ఎస్టీ లకు రిజర్వ్ చేయబడినది)
  3. ఖానాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం, (ఎస్టీ లకు రిజర్వ్ చేయబడినది)
  4. ఆదిలాబాదు అసెంబ్లీ నియోజకవర్గం,
  5. బోథ్ అసెంబ్లీ నియోజకవర్గం, (ఎస్టీ లకు రిజర్వ్ చేయబడినది)
  6. నిర్మల్ అసెంబ్లీ నియోజకవర్గం,
  7. ముధోల్ అసెంబ్లీ నియోజకవర్గం,
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు 

లోక్‌సభ పదవీకాలం సభ్యుని పేరు ఎన్నికైన పార్టీ
1వ 1952-57 సి.మాధవరెడ్డి సోషలిస్టు పార్టీ
2వ 1957-62 కె.ఆశన్న కాంగ్రెస్ పార్టీ
3వ 1962-67 జి.నారాయణరెడ్డి కాంగ్రెస్ పార్టీ
4వ 1967-71 పి.గంగారెడ్డి కాంగ్రెస్ పార్టీ
5వ 1971-77 పి.గంగారెడ్డి కాంగ్రెస్ పార్టీ
6వ 1977-80 జి.నరసింహారెడ్డి కాంగ్రెస్ పార్టీ
7వ 1980-84 జి.నరసింహారెడ్డి కాంగ్రెస్ పార్టీ
8వ 1984-89 సి.మాధవరెడ్డి తెలుగుదేశం పార్టీ
9వ 1989-91 పి.నర్సారెడ్డి కాంగ్రెస్ పార్టీ
10వ 1991-96 అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తెలుగుదేశం పార్టీ
11వ 1996-98 సముద్రాల వేణుగోపాలాచారి తెలుగుదేశం పార్టీ
12వ 1998-99 సముద్రాల వేణుగోపాలాచారి తెలుగుదేశం పార్టీ
13వ 1999-04 సముద్రాల వేణుగోపాలాచారి తెలుగుదేశం పార్టీ
14వ 2004-08 తక్కల మధుసూధనరెడ్డి తెలంగాణా రాష్ట్రసమితి
- 2008-09 అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ
15వ 2009-14 రమేష్ రాథోడ్ తెలుగుదేశం పార్టీ
16వ 2014-2019 గొడం నగేష్ తెలంగాణా రాష్ట్రసమితి
17వ 2019-ప్రస్తుతం సోయం బాపూరావు భారతీయ జనతాపార్టీ

2009 ఎన్నికలు
2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రమేష్ రాథోడ్ తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కె.రమేష్‌పై 1,15,087 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. రమేష్ రాథోడ్ 372268 ఓట్లు పొందగా, కె.రమేష్ 257181 ఓట్లు సాధించారు. ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి ఎం.నాగోరావు 3వ స్థానంలో, భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఎ.తుకారాం 4వ స్థానంలో నిలిచారు.

2014 ఎన్నికలు:
2014 ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి 11 అభ్యర్థులు నామినేషన్ వేయగా 2 నామినేషన్లు తిరస్కరించబడ్డాయి. ఒకరు నామినేషన్ విత్‌డ్రా చేసుకున్నారు. తుదిబరిలో 8 అభ్యర్థులు మిగిలారు.తెరాస అభ్యర్థి గొడం నగేశ్ తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేశ్ జాదవ్‌పై 171092 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు.

2019 ఎన్నికలు:
2019లో జరిగిన 17వ లోక్6సభ ఎన్నికలలో ఇక్కడి నుంచి భారతీయ జనతాపార్టీకి చెందిన సోయం బాపూరావు తన సమీప ప్రత్యర్థి, సిటింగ్ ఎంపీ అయిన తెరాసకు చెందిన గొడం నగేష్‌పై 58493 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. బాపూరావుకు 377194 ఓట్లు రాగా, నగేశ్‌కు 318701 ఓట్లు లభించాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన రమేష్ రాథోడ్ 3,14,238 ఓట్లతో మూడోస్థానంలో నిలిచారు. ఈ స్థానం నుంచి భాజపా విజయం సాధించడం ఇది తొలిసారి.


హోం,
విభాగాలు: ఆదిలాబాదు జిల్లా నియోజకవర్గాలు, ఆదిలాబాదు లోకసభ నియోజకవర్గం, తెలంగాణ లోక్‌సభ నియోజకవర్గాలు


 = = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక