బూచేపల్లి శివప్రసాదరెడ్డి
(మాజీ శాసనసభ్యులు)
| |
జననం | ఏప్రిల్ 6, 1980 |
స్వస్థలం | చీమకుర్తి |
జిల్లా | ప్రకాశం జిల్లా |
పదవులు | ఎమ్మెల్యే (2009-13) |
బూచేపల్లి శివప్రసాదరెడ్డి ప్రకాశం జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు. ఏప్రిల్ 6, 1980న జన్మించిన శివప్రసాదరెడ్డి స్వగ్రామం ప్రకాశం జిల్లా చీమకుర్తి. ఎంబీబీఎస్ అభ్యసించారు. శివప్రసాదరెడ్డి 2009లో దర్శి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికయ్యారు. పార్టీ విప్‌ను ఉల్లంఘించి అవిశ్వాసానికి అనుకూలంగా ఓటువేసి జూన్ 8, 2013న శాసనసభ్యత్వాన్ని కోల్పోయారు.
శివప్రసాదరావు తండ్రి బూచేపల్లి సుబ్బారెడ్డి కూడా 2004లో దర్శి నుంచే శాసనసభకు ఎన్నికయ్యారు. తల్లి బూచేపల్లి వెంకాయమ్మ మండల అధ్యక్షురాలిగా పనిచేశారు.
శివప్రసాదరావు తండ్రి బూచేపల్లి సుబ్బారెడ్డి కూడా 2004లో దర్శి నుంచే శాసనసభకు ఎన్నికయ్యారు. తల్లి బూచేపల్లి వెంకాయమ్మ మండల అధ్యక్షురాలిగా పనిచేశారు.
విభాగాలు: ప్రకాశం జిల్లా రాజకీయ నాయకులు, దర్శి అసెంబ్లీ నియోజకవర్గం, చీమకుర్తి మండలము, |
= = = = =
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి