పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
(మాజీ మంత్రి)
| |
జననం | జూలై 1, 1952 |
రంగం | రాజకీయాలు |
పదవులు | ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి, |
నియోజకవర్గం | పీలేరు, ఉంగనూరు |
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిత్తూరు జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు. ఇతను జూలై 1, 1952న జన్మించారు. అర్థశాస్త్రంలో పీహెచ్‌డి చేశారు. 1978లో పీలేరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జనతాపార్టీ అభ్యర్థిగా పోటీచేశారు. 1989, 1999, 2004లలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసి విజయం సాధించారు. 2009లో ఉంగనూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి విజయం సాధించి రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం పొందారు. పార్టీ విప్‌ను ఉల్లంఘించి అవిశ్వాసానికి అనుకూలంగా ఓటువేసి జూన్ 8, 2013న శాసనసభ్యత్వాన్ని కోల్పోయారు.
విభాగాలు: చిత్తూరు జిల్లా ప్రముఖులు, పీలేరు అసెంబ్లీ నియోజకవర్గం, ఉంగనూరు అసెంబ్లీ నియోజకవర్గం, రాష్ట్ర మంత్రులు, |
= = = = =
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి