స్వాతంత్ర్య సమరయోధుడు, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, కమ్యూనిస్టు నాయకుడు చండ్ర రాజేశ్వరరావు జూన్ 6, 1914న కృష్ణా జిల్లా మంగళాపురం గ్రామంలో జన్మించారు. ఉన్నత విద్యకై బనారస్ విశ్వవిద్యాలయం వెళ్ళారు. అక్కడ ఉన్నపుడే కమ్యూనిస్టు పార్టీ వైపు ప్రభావితులైనారు. కృష్ణా జిల్లా కమ్యూనిస్టు పార్టీ కమిటి కార్యదర్శిగా, రాష్ట్ర కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శిగా, కేంద్ర కమ్యూనిస్టు పార్టీ సభ్యుడిగా, పోలిట్ బ్యూరో సభ్యుడిగా, 1964లో కమ్యూనిస్టు పార్టీ చీలిక అనంతరం సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పదవులు పొందారు. 28 సంవత్సరాలకు పైగా భారతీయ కమ్యూనిస్టు పార్టీ (సి.పి.ఐ.)కి జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉండి 1992లో ఆనారోగ్యకారణాల వల్ల విరమించుకున్నారు. సంపన్న రైతు కుటుంబంలో జన్మించిననూ తాడిత, పీడిత ప్రజాసమస్యలకై కృషిచేశారు. జాతీయ స్థాయిలోనే కమ్యూనిస్టు నాయకుడిగా పేరుపొందారు. అంతర్జాతీయ స్థాయి కమ్యూనిస్టు సమావేశాలకు కూడా పలుసార్లు హాజరయ్యారు. అంతర్జాతీయ కమ్యూనిస్టు దృక్పథంతో సామ్రాజ్యవాద వ్యతిరేక ఉద్యమాలను, శాంతి ఉద్యమాలను ముందుకు తీసుకెళ్ళినందుకు రాజేశ్వరరావును `ఆర్డర్ ఆఫ్ లెనిన్' అవార్డు తో సోవియట్ యూనియన్, `ఆర్డర్ ఆఫ్ డెమిట్రోవ్' అవార్డుతో బల్గేరియా, అలాగే చెకోస్లోవేకియా, మంగోలియా దేశాలు అవార్డులతో సత్కరించాయి. రాజేశ్వరరావు అనారోగ్యంతో బాధపడుతూ ఏప్రిల్ 9, 1994న మరణించారు. ఆయన స్మారకార్ధం హైదరాబాదు శివార్లలోని కొండాపూర్ లో ఉన్న చండ్ర రాజేశ్వరరావు ఫౌండేషన్ లో కాంశ్య విగ్రహాన్ని ఆవిష్కరించారు.
= = = = =
సంప్రదించిన గ్రంథాలు, వెబ్‌సైట్లు:
|
4, జూన్ 2013, మంగళవారం
చండ్ర రాజేశ్వరరావు (Chandra Rajeshwar Rao)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి