గోలకొండ పత్రిక 1926, మార్చి 10న సురవరం ప్రతాపరెడ్డి సంపాదకత్వంలో ప్రారంభమైనది. ఇది మొదట ద్వైవార పత్రికగా ఉంటూ సోమ మరియు బుధవారాలలో వెలువడేది. 1947 నుంచి దినపత్రికగా మారింది. సురవరం ప్రతాపరెడ్డి నిజాం నిరంకుశ విధానాలను పత్రిక ద్వారా ఎదుర్కొన్నారు. తెలుగు సాహిత్యానికి పత్రిక ద్వారా ఎనలేని కృషిచేశారు. తెలంగాణాలో కవులే లేరనే నిందను సవాలుగా తీసుకొని ఈ పత్రికకు అనుబంధంగా గోలకొండ కవుల సంచిక విడుదల చేసి విమర్శకుల నోరుమూయించారు. దాదాపు 4 దశాబ్దాలు కొనసాగి 1966లో పత్రిక మూతపడింది.
గోలకొండ పత్రిక మూతపడిననూ ఆ పత్రిక సంచికలకు ఇప్పటికీ ఎనలేని ప్రాధాన్యత ఉంది. తెలంగాణ గురించి, పాలమూరు జిల్లా గురించి సాహిత్య, సాంస్కృతిక తదితర అంశాలకై ఇప్పటికీ రచయితలు ఈ పత్రికపైనే ఆధారపడుతున్నారు. ప్రెస్ అకాడమీ వారు ఈ పత్రిక సంచికలన్నీ స్కాన్ చేసి అంతర్జాలంలో అందుబాటులో ఉంచడంతో పరిశోధకులకు, ఔత్సాహికులకు మరింత సులభమైంది. సురవరం సంపాదకత్వంలో వెడువడినందున గోల్కొండ పత్రికకు మంచిపేరు రావడమే కాకుండా ఆ పత్రికలో నిర్భయంగా నిజాం ప్రభుత్వ దారుణాలను పాథకులందించి "గోలకొండ ఫిరంగి"గా సురవరం ప్రసిద్ధి చెందారు. తెలంగాణ ప్రజల రాజకీయ చైతన్యానికి పత్రిక దోహదపడింది.
= = = = =
సంప్రదించిన గ్రంథాలు, వెబ్‌సైట్లు:
|
4, జూన్ 2013, మంగళవారం
గోలకొండ పత్రిక (Golkonda Patrika)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
good
రిప్లయితొలగించండిchaalaa theliyani vishayaalu ceppinaduku dhanyavaadaalu
రిప్లయితొలగించండిమీ వ్యాఖ్యకు కృతజ్ఞతలు
తొలగించండి