దుగ్గిరాల గోపాలకృష్ణయ్య (1889-1928) | |
జననం | జూన్ 2, 1889 (పెనుగంచిప్రోలు) |
జిల్లా | కృష్ణా జిల్లా |
రంగం | స్వాతంత్ర్యోద్యమం |
బిరుదు | ఆంధ్రరత్న |
మరణం | జూన్ 10, 1928 |
ఆంధ్రరత్న బిరుదాంకితుడు, స్వాతంత్ర్యోద్యమంలో ముఖ్యంగా చీరాల-పేరాల ఉద్యమంలో పేరుగాంచిన దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జూన్ 2, 1889న కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలులో మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఆయన పుట్టిన మూడవ రోజునే తల్లి సీతమ్మ, మూడో ఏట తండ్రి కోదండరామస్వామి మరణించారు. అప్పటినుండి పినతండ్రి, నాయనమ్మల సంరక్షణలో పెరిగారు.
కూచిపూడి, గుంటూరులలో ప్రాథమిక విద్య, బాపట్లలో హైస్కూలు విద్య అభ్యసించారు. స్కాట్లాండులోని ఎడింబరో విశ్వవిద్యాలయంలో ఎం.ఎ. చదివారు. 'నందికేశ్వరుడు' రచించిన 'అభినయ దర్పణం' అనే సంస్కృత గ్రంథాన్నిఆంగ్లంలోకి అనువదించారు. భారత్ తిరిగివచ్చిన పిదప రాజమండ్రి, బందరులలో లెక్చరర్ వృత్తిలో పనిచేశారు. 1919లో లెక్చరర్ వృత్తిని త్యజించి జాతీయోద్యమంలో ప్రవేశించారు.
చీరాల-పేరాల ఉద్యమం ముందుండి నడిపించారు. వందలాది యువకులను చేరదీసి "రామదండు" పేరిట స్వచ్ఛంద సేవాదళాన్ని ఏర్పాటుచేశారు. 1919లో బ్రిటిష్ ప్రభుత్వం చీరాల, పేరాల మునిసిపాలిటీలను విలీనం చేసినపుడు, అందుకు వ్యతిరేకంగా జరిగిన సహాయ నిరాకరణోద్యమానికి గోపాలకృష్ణయ్య నాయకత్వం వహించారు. చీరాల-పేరాల గ్రామాలను పురపాలక సంఘాలుగా చేసినప్పుడు పన్నుల భారం అధికమౌతుందని ప్రజలను గ్రామాలు ఖాళీచేయించి ఊరివెలుపల గుడిసెలు వేయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం నిర్వహించారు. ఇది తెలుగువారు నిర్వహించిన స్వాతంత్ర్య పోరాటంలో ఒక ముఖ్యమైన ఘట్టం. ఆంధ్రదేశం అంతా తిరిగి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రచారం చేశారు. నిషేధాన్ని ఉల్లంఘించి బరంపురంలో ఉపన్యాసం చేసినందుకు ఒక సంవత్సరం పాటు జైలుశిక్ష అనుభవించారు.
తెలుగు నాట జానపద కళా రూపాల పునరుద్ధరణకు, గ్రంథాలయాల వ్యాప్తికి గోపాలకృష్ణయ్య ఇతోధికంగా కృషి చేశారు. దుగ్గిరాల కొంతకాలం పాటు "సాధన" అనే ఆంగ్ల పత్రికను నడిపారు. ఆంధ్రరత్న అనే బిరుదాన్ని పొందారు. చిన్నవయస్సులోనే నాలుగు పదుల వయస్సు నిండకముంచే జూన్ 10, 1928న క్షయవ్యాధితో మరణించారు.

విభాగాలు: కృష్ణా జిల్లా సమరయోధులు, 1889, 1928, |
= = = = =
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి