నల్లారి అమర్‌నాథ్ రెడ్డి
| |
స్వస్థలం | నగిరిపల్లి |
జిల్లా | చిత్తూరు జిల్లా |
పదవులు | రాష్ట్ర మంత్రి, 4 సార్లు ఎమెల్యే, |
నియోజకవర్గం | వాయల్పాడు |
నల్లారి అమర్‌నాథ్ రెడ్డి చిత్తూరు జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు. ఇతను కలిగిరి మండలం నగిరిపల్లికి చెందినవారు. 4సార్లు శాసనసభకు ఎన్నికయ్యారు. మర్రి చెన్నరెడ్డి, టంగుటూరి అంజయ్య, భవనం వెంకట్రాంరెడ్డి మంత్రివర్గాలలో పనిచేశారు. 1962లో తొలిసారి ఇండిపెండెంటుగా పోటీచేసి వాయల్పాడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. 1972, 1978, 1985లలో కూడా ఇదే నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున విజయం సాధించారు. వీరి కుమారుడు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు.
విభాగాలు: చిత్తూరు జిల్లా ప్రముఖులు, రాష్ట్ర మంత్రులు, వాయల్పాడు అసెంబ్లీ నియోజకవర్గం, |
= = = = =
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి