13, జూన్ 2013, గురువారం

కడప లోకసభ నియోజకవర్గం (Kadapa Loksabha Constituency)

కడప లోకసభ నియోజకవర్గం
జిల్లాకడప
ప్రస్తుత ఎంపివై.ఎస్.అవినాష్ రెడ్డి
పార్టీవైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ


ఆంధ్రప్రదేశ్ లోని 25 లోకసభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోకసభ నియోజకవర్గంలో కడప జిల్లాకు చెందిన 7 అసెంబ్లీ నియోజకవర్గ సెగ్మెంట్లు ఉన్నాయి. 2019లో జరిగిన 17వ లోకసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి వైకాపాకు చెందిన వై.ఎస్.అవినాష్ రెడ్డి ఎన్నికయ్యారు.

దీని పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలు
  1. బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గం (ఎస్సీ)
  2. కడప అసెంబ్లీ నియోజకవర్గం
  3. పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం
  4. కమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం
  5. జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గం
  6. ప్రొద్దుటూరు అసెంబ్లీ నియోజకవర్గం
  7. మైదుకూరు అసెంబ్లీ నియోజకవర్గం
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు 


లోక్‌సభ పదవీకాలం సభ్యుని పేరు ఎన్నికైన పార్టీ
1వ 1952-57 వై.ఈశ్వరరెడ్డి భారతీయ కమ్యూనిస్టు పార్టీ
2వ 1957-62 ఊటుకూరు రామిరెడ్డి కాంగ్రెస్ పార్టీ
3వ 1962-67 వై.ఈశ్వరరెడ్డి భారతీయ కమ్యూనిస్టు పార్టీ
4వ 1967-71 వై.ఈశ్వరరెడ్డి భారతీయ కమ్యూనిస్టు పార్టీ
5వ 1971-77 వై.ఈశ్వరరెడ్డి భారతీయ కమ్యూనిస్టు పార్టీ
6వ 1977-80 కందుల ఓబుల్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ
7వ 1980-84 కందుల ఓబుల్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ
8వ 1984-89 డి.ఎన్.రెడ్డి తెలుగుదేశం పార్టీ
9వ 1989-91 వై.ఎస్.రాజశేఖరరెడ్డి కాంగ్రెస్ పార్టీ
10వ 1991-96 వై.ఎస్.రాజశేఖరరెడ్డి కాంగ్రెస్ పార్టీ
11వ 1996-98 వై.ఎస్.రాజశేఖరరెడ్డి కాంగ్రెస్ పార్టీ
12వ 1998-99 వై.ఎస్.రాజశేఖరరెడ్డి కాంగ్రెస్ పార్టీ
13వ 1999-04 వై.ఎస్.వివేకానందరెడ్డి కాంగ్రెస్ పార్టీ
14వ 2004-9 వై.ఎస్.వివేకానందరెడ్డి కాంగ్రెస్ పార్టీ
15వ 2009-10 వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ
(ఉప ఎన్నిక) 2010-14 వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి వైకాపా
16వ 2014-19 వై.ఎస్.అవినాష్ రెడ్డి వైకాపా
17వ 2019- వై.ఎస్.అవినాష్ రెడ్డి వైకాపా

2009 ఎన్నికలు
2009 ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీకి చెందిన పి.శ్రీకాంత్ రెడ్డిపై 1,75,751 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. జగన్‌కు 538031 ఓట్లు రాగా, శ్రీకాంత్‌కు 362280 ఓట్లు లభించాయి. ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి కలీల్ బాషా 3వ స్థానంలో, బీఎస్పీ అభ్యర్థి జె.మునిరెడ్డి 4వ స్థానంలో, భారతీయ జనతా పార్టీ అభ్యర్థి వి.శశిభూషన్ రెడ్డి 5వ స్థానంలో నిలిచారు.

2010 ఉప ఎన్నికలు:
జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి, లోకసభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో జరిగిన ఉప ఎన్నికలో జగన్మోహన్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసి సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన డి.ఎస్.రవీంద్రారెడ్డిపై రికార్డుస్థాయి భారీ మెజారిటీతో విజయం సాధించారు.

2019 ఎన్నికలు:
2019 ఎన్నికలలో ఇక్కడి నుంచి వైకాపాకు చెందిన సిటింగ్ ఎంపీ వై.ఎస్.అవినాష్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి, తెలుగుదేశం పార్టీకి చెందిన ఆదినారాయణ రెడ్డిపై 3,80,726 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. వైకాపా అభ్యర్థికి 7,83,499 ఓట్లు రాగా, తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి 4,02,773 ఓట్లు వచ్చాయి.


హోం,
విభాగాలు: కడప జిల్లా నియోజకవర్గాలు, కడప లోకసభ నియోజకవర్గం, ఆంధ్రప్రదేశ్ లోకసభ నియోజకవర్గాలు


 = = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక