కాళేశ్వరం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవ్‌పూర్ మండలమునకు చెందిన గ్రామము. కరీంనగర్ జిల్లాలో ఉత్తరం వైపున గోదావరి నది తీరాన మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న కాళేశ్వరం ప్రముఖ పుణ్యక్షేత్రము. మండలకేంద్రం మహాదేవ్‌పూర్ నుంచి 16 కిలోమీటర్ల దూరంలో ఉంది. శ్రీశైల, ద్రాక్షారామ, కాళేశ్వరం అనే త్రిలింగక్షేత్రాలలో ఒకటిగా ఈ క్షేత్రం ప్రసిద్ధిగాంచినది. ఈ 3 క్షేత్రాలవల్లనే ఆంధ్రదేశానికి త్రిలింగదేశమని పేరువచ్చినట్లు చెబుతారు. త్రివేణి సంగమంగా ప్రసిద్ధి చెందిన కాళేశ్వరంలో గోదావరి, ప్రాణహిత మరియు అంతర్వాహినీగా సరస్వతి నదులు కలియుచున్నవి. స్కందపురాణం లోని కాళేశ్వరఖండంలో కాళేశ్వరం క్షేత్రం గురించి ఉంది. 2010 డిసెంబరులో ప్రాణహిత పుష్కరాలు జరిగాయి. 2013, మే 29న సరస్వతి పుష్కరాలు ప్రారంభమయ్యాయి.
జనాభా: 2001 లెక్కల ప్రకారం కాళేశ్వరం గ్రామ జనాభా 1986. ఇందులో పురుషులు 959, మహిళలు 127. గృహాల సంఖ్య 492. ముక్తీశ్వరస్వామి ఆలయం: దేశంలోనే ఒకే పానపట్టంపై 2 లింగాలున్న ఏకైక ఆలయమిది. మహాశివుడు శ్రీ కాళేశ్వర-ముక్తేశ్వర స్వామిగా పూజలందుకుంటున్నాడు. నాసికా రంద్రాలలో ఎంత నీరు పోసిననూ పైకి రాకపోవడం కాళేశ్వరంలోని ముక్తీశ్వర లింగం ప్రత్యేకత. త్రివేణిసంగమతీరంలో ఆ నీరు కలుస్తుందని చారిత్రక ఆధారాల వల్ల తెలుస్తుంది. ఈ దేవాలయంలోని కాళేశ్వరునికి ముందు పూజచేసి, అనంతరం ముక్తీశ్వరుని పూజిస్తే స్వర్గలోకం ప్రాప్తిస్తుందని భక్తుల విశ్వసిస్తారు. కాళేశ్వరంలోని ప్రధానాలయానికి పశ్చిమం వైపు యమగుండం మీద కొద్దిదూరంలోనే ఆదిముక్తీశ్వరాలయం ఉంది. ఈ ఆలయం చుట్టుప్రక్కల ప్రకృతి సిద్ధంగా విభూతి రాళ్లు లభించడం విశేషంగా చెప్పవచ్చు. కాళేశ్వరం మహారాష్ట్ర సరిహద్దులో ఉండుటచే ఆంధ్రప్రదేశ్ భక్తులతోపాటు మహారాష్ట్ర భక్తులు కూడా అత్యధికంగా వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. ఇవి కూడా చూడండి:
= = = = =
|
30, మే 2013, గురువారం
కాళేశ్వరం (Kaleshwaram)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
Super material than q
రిప్లయితొలగించండిమీ వ్యాఖ్యకు కృతజ్ఞతలు
తొలగించండి