భారతదేశంలోనే అతిపెద్ద నీటిపారుదల ప్రాజెక్టుగా రూపుదిద్దుకుంటున్న కాళేశ్వరం ప్రాజెక్టును మే 2, 2016న ముఖ్యమంత్రి కేసీఆర్‌చే శంకుస్థాపన చేయబడింది. ప్రాణహిత నది గోదావరిలో కలిసిన పిదప జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం వద్ద బ్యారేజీలు నిర్మించి 180 టీఎంసిల నీటిని మళ్ళించి 13 జిల్లాల పరిధిలోని 18.25 లక్షల ఎకరాలకు సాగునీరు అందించుట, 18.8 లక్షల ఎకరాల ఆయకట్టు భూమిని స్థిరీకరించుట ఈ ప్రాజెక్టు లక్ష్యం. ఈ ప్రాజెక్టులో భాగంగా 20 ఎత్తిపోతల (లిఫ్టులు), 19 పంప్‌హౌస్‌లను నిర్మిస్తున్నారు. ప్రాణహిత చేవెళ్ళ పునరాకృతిలో భాగంగా కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని చేపట్టారు.
రూ. 80,500/- కోట్లు అంచనావ్యయంతో ప్రారంభించిన ఈ ప్రాజెక్టు మొదటిఘట్టం మేడిగడ్డ బ్యారేజీ. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ నుంచి అన్నారం (కన్నేపల్లి), సుందిళ్ళ, ఎల్లంపల్లి, మేడారం, రామడుగు, మధ్యమానేరు, మల్లన్నసాగర్, కొండపోచమ్మ వరకు ఎత్తిపోతల ద్వారా నీటిని ఎత్తిపోస్తారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన బ్యారేజీలలో పెద్దది మల్లనసాగర్, రెండోపెద్ద బ్యారేజీ కోండపోచమ్మ వద్ది నిర్మించారు. ఏప్రిల్ 24, 2019న కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నందిమేడారంలో తొలి సర్జిపూల్ ప్రారంభించబడింది. జూన్ 21, 2019న కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమానికి మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు కూడా హాజరౌతారు. ఇవి కూడా చూడండి:
= = = = =
|
20, జూన్ 2019, గురువారం
కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి