పనబాక లక్ష్మి
| |
| జననం | 6 అక్టోబరు, 1958 |
| స్వస్థలం | కావలి |
| పదవులు | 4 సార్లు ఎంపి, కేంద్ర మంత్రి, |
| నియోజకవర్గం | నెల్లూరు లో/ని (1996, 1998, 2004), బాపట్ల లో/ని (2009) |
పనబాక లక్ష్మి నెల్లూరు జిల్లాకు చెందిన రాజకీయ నాయకురాలు. ఈమె 6 అక్టోబరు, 1958న నెల్లూరు జిల్లా కావలిలో జన్మించారు. 1996, 1998లలో నెల్లూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున లోకసభకు ఎన్నికయ్యారు. 1999లో నెల్లూరు నుంచే పోటీచేసి పరాజయం పొందారు. 2004లో మళ్ళీ నెల్లూరు నుంచి పోటీచేసి 3వ సారి విజయం సాధించారు. కేంద్ర మంత్రివర్గంలో స్థానం పొందారు. నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ఫలితంగా నెల్లూరు నియోజకవర్గం జనరల్ కావడంతో 2009లో బాపట్ల (ఎస్టీ) నియోజకవర్గం నుంచి పోటీచేసి 4వ సారి లోకసభలో ప్రవేశించారు. మరోసారి కేంద్రమంత్రిగా పదవి పొందారు.
| విభాగాలు: నెల్లూరు జిల్లా ప్రముఖులు, 11వ లోకసభ సభ్యులు, 12వ లోకసభ సభ్యులు,14వ లోకసభ సభ్యులు, 15వ లోకసభ సభ్యులు, కావలి మండలము, కేంద్రమంత్రులు, |
= = = = =
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి