25, జూన్ 2013, మంగళవారం

దేవదాసు (Devdas)

 దేవదాసు (సినిమా)
విడుదలజూన్ 26, 1953
దర్శకుడువేదాంతం రాఘవయ్య
నిర్మాతడి.ఎల్.నారాయణ
హీరోఅక్కినేని నాగేశ్వరరావు
హీరోయిన్సావిత్రి
ప్రముఖ బెంగాలీ రచయిత శరత్ చంద్ర రచించిన నవలను చక్రపాణి తెలుగులో అనువదించగా, ఆ నవల ఆధారంగా 1951లో వినోద పిక్చర్స్ బ్యానర్‌పై డి.ఎల్.నారాయణ నిర్మాతగా, వేదాంతం రాఘవయ్య దర్శకత్వంలో చిత్రీకరించబడి జూన్ 26, 1953నాడు విడుదలైన సినిమా దేవదాసు. ఈ చిత్రం తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయమై అరవై ఏళ్ళు గడిచినా అందులోని పాటలు ఇంకనూ ఆదరణ పొందుతూనే ఉన్నాయి.

ఈ చిత్రంలో ప్రధాన పాత్ర దేవదాసుగా అక్కినేని నాగేశ్వరరావు పోషించగా, కథానాయిక పార్వతి పాత్రను సావిత్రి ధరించారు. జమీందారు కుమారుడు పేద అమ్మాయిని ప్రేమించడం, ఇంట్లో ఒప్పుకోకపోవడం, ఆమెను మరిచిపోక తాగుడుకు బానిస కావడం ఇదీ ఈ సినిమా సంక్షిప్త కథ. ఈ కథ కంటె కథానాయకుడు అభినయించిన నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. దేవదాసు కథతో తొలుత బెంగాలి, హిందీ భాషలలో సినిమాలు వచ్చిననూ తెలుగులో అక్కినేని నటించిన దేవదాసుకు వచ్చినంత ఆదరణ వాటికి రాలేదు. తెలుగులో కూడా ఇదే పేరుతో ఆ తర్వాత సినిమాలు వచ్చిననూ దీనికి వచ్చినంద క్రేజి మరేచిత్రానికి రాలేదు. విశేషమేమిటంటే అక్కినేని, సావిత్రిలు ఈ పాత్రలకు సరిపోరని, ఈ చిత్రం విఫలమైతుందని చిత్రం విడుదల కాకముందే నిర్మాత, దర్శకులను హెచ్చరించినవారికి ఈ చిత్రం విడుదలైన పిదప ప్రేక్షకాదరణే వారికి తిరుగులేని సమాధానమైంది.

ఈ సినిమాలో జనాదరణ పొందిన పాటలు
  • జగమే మాయ బ్రతుకే మాయ,
  • పల్లెకు పోదాం పారుని చూదం చలొ చలొ,
  • కుడి ఎడమైతె పొరపాటు లేదోయ్, ఓడి పోలేదోయ్,
  • అందం చూడవయ ఆనందించ వయ,
  • చెలియ లేదు చెలిమి లేదు వెలుతురె లేదు ఉన్నదంత చీకటైతె,
  • అంతా భ్రాంతి యేనా జీవితానా వెలుగింతేనా,
విభాగాలు: తెలుగు సినిమాలు, 1953,


 = = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక