రాయప్రోలు సుబ్బారావు
(1892-1984)
| |
జననం | మార్చి 17, 1892 |
స్వస్థలం | గార్లపాడు (గుంటూరు జిల్లా) |
రంగం | సాహితీవేత్త |
రచనలు | తృణకంకణము, |
మరణం | జూన్ 30, 1984 |
భావ కవితా పితామహుడిగానూ, నవ్య కవితా పితామహుడిగానూ పేరుపొందిన రాయప్రోలు సుబ్బారావు మార్చి 17, 1892న గుంటూరు జిల్లా గార్లపాడు గ్రామంలో జన్మించారు. విద్యార్థి దశలోనే కవితలు, పద్యాలు వ్రాయడం ప్రారంభించి, తృణకంకణం లాంటి ప్రముఖ కవితా గ్రంథాలను తెలుగువారికి అందించిన రాయప్రోలు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో లెక్చరర్‌గా, ప్రొఫెసర్‌గా, రీడర్‌గా ఎందరో విద్యార్థులను తీర్చిదిద్దారు. సహాయ సంపాదకుడిగా ఆంధ్రవిజ్ఞానసర్వస్వము రూపకల్పనలో తనవంతు పాత్ర పోష్ంచారు. మూడేళ్ళపాటు రవీంద్రనాథ్ ఠాగూర్ ప్రారంభించిన శాంతినికేతన్‌లో ఉండి సాహిత్యాన్ని అధ్యయనం చేశారు. సికింద్రాబాదులో స్థిరపడి నవ్యసాహిత్య పరిషత్ అధ్యక్షునిగా, ఆంధ్రపండిత పరిషత్ అధ్యక్షునిగానూ బాధ్యతలు నిర్వహించారు. "ఏ దేశమేగినా ఎందుకాలిడిగా..." లాంటి జనాదరణ పొందిన కవితలు రచించిన రాయప్రోలు జూన్ 30, 1984న మరణించారు.
రచనలు:
తృణకంకణము, ఆంధ్రావళి, కష్టకమల, రమ్యలోకము, వనమాల, మిశ్రమంజరి, స్నేహలతా దేవి, స్వప్నకుమారము, తెలుగు తోట, మాధురీ దర్శనం.
రచనలు:
తృణకంకణము, ఆంధ్రావళి, కష్టకమల, రమ్యలోకము, వనమాల, మిశ్రమంజరి, స్నేహలతా దేవి, స్వప్నకుమారము, తెలుగు తోట, మాధురీ దర్శనం.
విభాగాలు: గుంటూరు జిల్లా రచయితలు, 1892, 1984, |
= = = = =
రాయప్రోలు సుబ్బారావు గారి తల్లి తండ్రుల పేరు
రిప్లయితొలగించండి