|
మంజుల (1953-2013)
|
|
జననం | సెప్టెంబరు 9, 1953 |
రంగం | సినిమా నటి |
భర్త | విజయ్ కుమార్ |
మరణం | జూలై 23, 2013 |
తెలుగు, కన్నడ, తమిళ సినీనటిగా పేరుపొందిన మంజుల సెప్టెంబరు 9, 1953న జన్మించారు. 1969లో తొలిసారిగా శాంతినిలయం తమిళ చిత్రంలో బాలనటిగా నటించారు. తెలుగులో మంజుల నటించిన తొలి సినిమా జైజవాన్. దాదాపు 100 సినిమాలలో నటించిన మంజుల చివరి తెలుగు చిత్రం వాసు. తెలుగులో ఎన్టీయార్, అక్కినేని, కృష్ణ, శోభన్‌బాబులతో నటించి మంచి నటిగా పేరుపొందారు. 1974లో శోభన్‌బాబుతో కలిసి నటించిన మంచిమనుషులు చిత్రం, కృష్ణతో కలిసి నటించిన మాయగారి మలిగాడు చిత్రం ఈమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది. అల్లూరి సీతారామరాజు, ఇద్దరూ ఇద్దరే, నేరం నాది కాదు ఆకలిది, మనుషులు చేసిన దొంగలు, దసరా బుల్లోడు, జేబుదొంగ లాంటి జనాదరణ పొందిన చిత్రాలలో ఈమె నటించారు. 60 ఏళ్ళ వయస్సులో జూలై 23, 2013న చెన్నైలో మంజుల మరణించారు. నటుడిగా పేరుపొందిన విజయ్ కుమార్‌ను వివాహమాడారు. వీరికి ముగ్గురు కుమారైలు. ప్రీతి, శ్రీదేవిలు సినిమా నటీమణులుగా పేరుపొందారు.
= = = = =
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి