23, జులై 2013, మంగళవారం

శ్రీశైలం ప్రాజెక్టు (Srisailam Project)

శ్రీశైలం ప్రాజెక్టు
నదికృష్ణానది
పూర్తయిన సంవత్సరం1964
జిల్లాకర్నూలు జిల్లా
సామర్థ్యం263 టి.ఎం.సి
కర్నూలు జిల్లాలో ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీశైలం సమీపంలో కృష్ణానదిపై శ్రీశైలం ప్రాజెక్టు నిర్మించబడింది. ఈ ప్రాజెక్టు ప్రస్తుతనామం నీలం సంజీవరెడ్డి సాగర్. ఇది ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ ప్రాజెక్టులలో ఒకటి. జూలై 24, 1963న అప్పటి ప్రధానమంత్రి జనహార్‌లాల్ నెహ్రూచే శంకుస్థాపన చేయబడ్డ ఈ ప్రాజెక్టు 1984 నాటికి నిర్మాణం తుదిదశకు చేరుకుంది. ప్రారంభంలో విద్యుదుత్పత్తి లక్ష్యంగా నిర్మించిన ప్రాజెక్టు, సాగునీటి అవసరాలకు కూడా ఉపయోగపడటంతో లక్షలాది ఎకరాల భూములకు నీరందించి, రైతు కుటుంబాలకు జీవనాధారంగా నిలిచింది.  అక్టోబరు 2, 2009న ప్రాజెక్టు చరిత్రలోనే అత్యధికంగా 13.5 లక్షల క్యూసెక్కుల వరద ప్రాజెక్టులోని ప్రవేశించింది. భారీ వరదనీటితో ప్రాజెక్టు సామర్థ్యం కంటె 10 అడుగుల పై నుంచి నీరు ప్రవహించింది.

ప్రాజెక్టుకు కుడిగట్టు, ఎడమగట్టు పేర్లతో 2 విద్యుత్ కేంద్రాలున్నాయి. కుడిగట్టు విద్యుత్కేంద్రం ఉత్పత్తి సామర్థ్యం: 770 మె.వా. (7x110). ఎడమగట్టు విద్యుత్కేంద్రం ఉత్పత్తి సామర్థ్యం:900 మె.వా.(6x150).


ప్రాజెక్టు గణాంకాలు:
డ్యాము పొడవు:512మీ.
క్రెస్టుగేట్ల సంఖ్య:12
జలాశయం పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యం:263 టి.ఎం.సి
ఇందులో వాడుకోగలిగే నీరు:223 టి.ఎం.సి

అక్టోబరు 2009 వరదలు:
ప్రాజెక్టు చరిత్రలోనే ఊహించడానికి కూడా వీలులేని విధంగా అక్టోబరు 2, 2009న ప్రాజెక్టు సామర్థానికి మించి వరదనీరు వచ్చిచేరింది. మూడుదశాబ్దాల క్రితం 13 లక్షల క్యూసెక్కుల సామర్థ్యంతో నిర్మించిన ఈ ప్రాజెక్టులోని 25 లక్షల క్యూసెక్కుల వరదనీరు ప్రవహించడంతో ప్రాజెక్టు అధికారులు భయాందోళనలకు గురయ్యారు. ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని గేట్లను పూర్తిస్థాయిలో ఎత్తిననూ ఇన్‌ఫ్లో చాలా అధికస్థాయిలో అవుట్‌ఫ్లో కంటె రెట్టింపు స్థాయిలో ఉండటంతో ఒకదశలో ప్రాజెక్టు పైనుంచి నీరు ప్రవహించవచ్చని ప్రాజెక్టు లోతట్టు గ్రామాలు మునిగిపోవచ్చని భావించారు. దీనితో విద్యుత్తు ఉత్పత్తిని పూర్తిగా నిలిపివేశారు. ప్రాజెక్టు లోతట్టు ప్రాంతాలలోని జనావాసాలను పూర్తిగా ఖాళిచేయించారు. ప్రాజెక్టు గరిష్ట నీటిమట్టం 885 అడుగులు కాగా అక్టోబరు 2, 2009 మధ్యాహ్నం నాటికి 896 అడుగులకు చేరింది. ప్రాజెక్టు గరిష్ట నీటిమట్టం దాటితే ఏ క్షణమైనా వరద ఉధృతితో ప్రాజెక్టుకు ముప్పు ఏర్పడుతుందని భావించిన ఇంజనీర్లు సైతం ప్రాజెక్టు శక్తిని చూసి నివ్వెరపోయారు.

విభాగాలు: కర్నూలు జిల్లా ప్రాజెక్టులు, కృష్ణానది,


 = = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక