30, జులై 2013, మంగళవారం

నేరెడిగొండ మండలం (Neredigonda Mandal)

నేరెడిగొండ మండలం
జిల్లా ఆదిలాబాదు
రెవెన్యూ డివిజన్ఆదిలాబాదు
అసెంబ్లీ నియోజకవర్గంబోథ్
లోకసభ నియోజకవర్గంఆదిలాబాదు
పర్యాటక ప్రాంతంకుంటాల జలపాతం,
జనాభా24632 (2001), 28760 (2011)
నేరెడిగొండ ఆదిలాబాదు జిల్లాకు చెందిన మండలము. ఈ మండలము ఆదిలాబాదు రెవెన్యూ డివిజన్, బోథ్ అసెంబ్లీ నియోజకవర్గం, ఆదిలాబాదు లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. మండల కేంద్రము 19° 16' 12'' ఉత్తర అక్షాంశం మరియు 78° 24' 26'' తూర్పు రేఖాంశంపై ఉన్నది. ఆంధ్రప్రదేశ్‌లో ఎత్తయిన కుంతల జలపాతం ఈ మండలంలో కడెం నదిపై ఉంది. నేరెడిగొండ, ఇచ్ఛోడ సరిహద్దులో కడెం నది ప్రవహిస్తోంది. ఈ మండలంలోని అన్ని గ్రామాలు పూర్వపు బోథ్ తాలుకాలోనివే. పూర్వం వైఢూర్యపురంగా పేరుపొందిన వడూరు ఈ మండలంలోనేఉంది. 44వ నెంబరు జాతీయ రహదారి మండలం గుండా వెళ్ళుచున్నది. ఈ మండలంలో కొండలు అధికం. స్వాతంత్ర్య సమరయోధుడు బొందిడి వెంకటరావు ఈ మండలంలోని వడూరుకు చెందినవారు. ఆదిలాబాదు జిల్లాలో ఈ మండలం కోడ్ సంఖ్య 21.

జనాభా:
2001 లెక్కల ప్రకారం మండల జనాభా 24632.
2011 లెక్కల ప్రకారం మండల జనాభా 28760. ఇందులో పురుషులు 14347, మహిళలు 14413.

కుంటాల జలపాతం ముందు బ్లాగు రచయిత
కుంటాల జలపాతం:
కుంటాల జలపాతం నేరెడిగొండ మండలం కుంటాల సమీపంలో కడెం నదిపై ఉంది. ఇది రాష్ట్రంలోనే అతి ఎత్తయిన జలపాతం. మండల కేంద్రానికి 12 కిమీ దూరంలో దట్టమైన అటవీప్రాంతంలో ఉంది. దీనికి ముందుగా కడెం జలాశయం ఉంది. 45మీటర్లు ఎత్తు నుంచి జాలువారే నీటిధారలతో జలపాతం ఏర్పడింది. జలపాతంలో సుడిగుండాలున్నాయి. ఎందరో వ్యక్తులు సుడి గుండాలలో పడి మరణించారు. జలపాతం మధ్యలో ఒక గుహ ఉంది. ఈ గుహలో సోమేశ్వర లింగం పూజలందుకుంటున్నది.

విభాగాలు: ఆదిలాబాదు జిల్లా మండలాలు, ఆదిలాబాదు రెవెన్యూ డివిజన్, బోథ్ అసెంబ్లీ నియోజకవర్గం, నేరడిగొండ మండలము, 


 = = = = =

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక