30, జులై 2013, మంగళవారం

కొండా సురేఖ (Konda Surekha)

కొండా సురేఖ
జననంఆగస్టు 19, 1965
జిల్లావరంగల్
పదవులు4 సార్లు ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి,
భర్తకొండా మురళి (మాజీ ఎమ్మెల్సీ)
కొండా సురేఖ వరంగల్ జిల్లాకు చెందిన రాజకీయ నాయకురాలు. ఈమె ఆగస్టు 19, 1965న వరంగల్‌లో జన్మించారు. మండల అధ్యక్షురాలిగా రాజకీయ ప్రస్థానం ఆరంభించి శాయంపేట నుంచి 2 సార్లు, పరకాల నుంచి ఒకసారి శాసనసభకు ఎన్నిక కావడమే కాకుండా వైఎస్సార్ మంత్రివర్గంలో స్థానం కూడా పొందారు.

రాజకీయ ప్రస్థానం:
కొండా సురేఖ 1995లో మండల అధ్యక్షురాలిగా ఎన్నికైనారు. 1996లో పిసిసి సభ్యులుగా నియమించబడి, 1999లో శాయంపేట నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున శాసనసభకు ఎన్నికయ్యారు. 2000లో ఏసిసిసి సభ్యులయ్యారు. 2004లో కూడా శాయంపేట నుంచి మరోసారి శాసనసభకు ఎన్నికయ్యారు. నియోజకవర్గాల పునర్విభజన అనంతరం 2009లో పరకాల నుంచి పోటీచేసి శాసనసభకు మూడవ సారి విజయం సాధించారు. వైఎస్సార్ మంత్రివర్గంలో స్త్రీ, శిశుసంక్షేమ శాఖ మంత్రిపదవిని పొందారు. వైఎస్సార్ మరణానంతరం ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయాలని వాదించి జగన్ పక్షాన నిలిచి మంత్రిపదవికి రాజీనామా చేశారు. కిరణ్ కుమార్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానంలో కాంగ్రెస్ పార్టీ విప్‌ను ఉల్లంఘించి శాసనసభ్యత్వాన్ని కోల్పోయారు. ఆ తర్వాత జరిగిన పరకాల ఉప ఎన్నికలలో వైకాపా తరఫున పోటీచేసి పరాజయం పొందారు. మారిన పరిస్థితుల కారణంగా ఒకప్పుడు జగన్‌కు బాసటగా నిలిచిన కొండా సురేఖ ఆమె భర్త కొండా మురళి దంపతులు జగన్‌పై విమర్శలు కురిపించి జూలై 30, 2013న వైఎస్సార్ సీపికి రాజీనామా చేసి సెప్టెంబరు 4, 2013న కాంగ్రెస్ పార్టీలో చేరి, మార్చి 18, 2014న తెరాసలో ప్రవేశించారు. 2014 శాసనసభ ఎన్నికలలో తెరాస తరఫున పోటీ చేసి విజయం సాధించారు.

కుటుంబం:
కొండా సురేఖ భర్త కొండా మురళి కూడా రాజకీయ నాయకులుగా ప్రసిద్ధులు. ఇతను ఎమ్మెల్సీగా పనిచేశారు.

విభాగాలు: వరంగల్ జిల్లా రాజకీయ నాయకులు, వరంగల్, శాయంపేట అసెంబ్లీ నియోజకవర్గం, పరకాల అసెంబ్లీ నియోజకవర్గం,  11వ శాసనసభ సభ్యులు,  13వ శాసనసభ సభ్యులు13వ శాసనసభ మంత్రులు, 1965లో జన్మించిన వారు, 14వ శాసనసభ సభ్యులు,


 = = = = =

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక