13, జులై 2013, శనివారం

నూకల చినసత్యనారాయణ (Nookala China Satyanarayana)

 నూకల చినసత్యనారాయణ
జననంఆగస్టు 4, 1927
స్వస్థలంఅనకాపల్లి
రంగంసంగీత విధ్వాంసుడు
మరణంజూలై 11, 2013
సంగీత విధ్వాంసుడు, పద్మభూషణ్ అవార్డు గ్రహీత నూకల చినసత్యనారాయణ విశాఖపట్టణం జిల్లా అనకాపల్లిలో ఆగస్టు 4, 1927న జన్మించారు. ద్వారం వెంకటస్వామినాయుడు వద్ద శిష్యరికం చేసి తర్వాత విజయనగర మహారాజ సంగీత కళాశాల, తెలుగు విశ్వవిద్యాలయంలో అధ్యాపకుడిగా పనిచేశారు.

సంగీత ప్రపంచానికి ఆయన చేసిన సేవలకు గాను అన్నమాచార్య విద్వన్మణి అవార్డు, నాదనిధి పురస్కారం పొందారు. బాలమరళికృష్ణ చేతులమీదుగా గండపెండేరం స్వీకరించారు. పుట్టపర్తిలో ఈయన చేసిన సంగీత కచేరికి ముగ్దులైన సాయిబాబా ఈయనకు వజ్రపు ఉంగరాన్ని బహుకరించారు.

సంగీతానికి సంబంధించి చినసత్యనారాయన పలు రచనలు చేశారు. రాగలక్షణ సంగ్రహం అనే 3 సంపుటాలు వెలువరించారు. త్యాగరాజ సారస్వత సర్వస్వంను రచించారు.తన జీవితకాలంలో ఎందరినో సంగీత విధ్వాంసులుగా తీర్చిదిద్దిన చినసత్యనారాయణ 86 సంవత్సరాల వయస్సులో జూలై 11, 2013న మరణించారు.

విభాగాలు: విశాఖపట్టణం జిల్లా ప్రముఖులు, అనకాపల్లి మండలము, సంగీత విధ్వాంసులు, 1927లో జన్మించినవారు, 2013లో మరణించినవారు


 = = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక