13, ఆగస్టు 2013, మంగళవారం

శ్రీదేవి (Sridevi)

జననంఆగస్టు 13, 1963
రంగంసినీనటి
అవార్డులుపద్మశ్రీ (2013), బంగారునంది (1991),
మరణంఫిబ్రవరి 24, 2018
దక్షిణ భారతదేశపు ప్రముఖ సినీనటిగా పేరుపొందిన శ్రీదేవి ఆగస్టు 13, 1963న తమిళనాడులోని శివకాశిలో జన్మించారు. చిన్నవయస్సులోనే బాలనటిగా సినీరంగప్రవేశం చేసి, అంచెలంచెలుగా ఎదిగి తమిళ, మలయాళ, తెలుగు, కన్నడ, హిందీ భాషాచిత్రాలలో తిరుగులేని కథానాయికగా పేరుసంపందించుకుంది. ఏడేళ్ళ వయసులోనే బాలనటిగా అవార్డు పొందినప్పటి నుంచి పలు రాష్ట్రాల నుంచి, జాతీయస్థాయిలోనూ ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంది. 1996లో బోనీకపూర్‌తో వివాహానంతరం నటన తగ్గించి, పదిహేనేళ్ళ తర్వాత ఇంగ్లీష్-వింగ్లీష్ ఆంగ్ల చిత్రం ద్వారా మళ్ళీ సినీప్రేక్షకల ముందుకు వచ్చింది. 2013లో భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ అవార్డును స్వీకరించింది. ఫిబ్రవరి 24, 2018న దుబాయిలో మరణించింది.

బాల్యం, సినీప్రస్థానం:
1963 ఆగస్టు 13న రాజేశ్వరి, అయ్యప్పన్ దంపతులకు శ్రీదేవి జన్మించింది. నాలుగేళ్ళ ప్రాయంలోనే తమిళ చిత్రంలో బాలనటిగా సినీప్రస్థానం ఆరంభించి, దక్షిణభారతీయ భాషాచిత్రాలన్నింటిలోనూ నటిస్తూ అన్ని భాషలలో మంచినటిగా పేరు తెచ్చుకుంది. శ్రీదేవి తెలుగు సినిమా రంగంలో కూడా అగ్రశ్రేణి కథానాయకి గా కొనసాగింది. దాదాపు అందరు అగ్ర కథానాయకులతో కలసి నటించింది. ఆమె నటించిన తెలుగు చిత్రాలకు ఎక్కువగా కె. రాఘవేంద్ర రావు దర్శకత్వం వహించారు. ఎన్.టి.రామారావుతో ఆమె కొడవీటి సింహం, వేటగాడు, సర్దార్ పాపారాయుడు, బొబ్బిలి పులి మొదలగు చిత్రాలలో నటించారు. ఎ.నాగేశ్వరరావుతో ముద్దుల కొడుకు, ప్రేమాభిషేకం, బంగారు కానుక, ప్రేమకానుక మొదలగు చిత్రాలలో నటించారు. సూపర్ స్టార్ కృష్ణతో కలిసి కంచు కాగడ, కలవారి సంసరం, కృష్ణావతారం, బురిపాలెం బుల్లోడు మొదలగు చిత్రాలలో నటించారు. ఆమె తెలుగు చిత్రాలలో నటిస్తూనే హిందీ సినీరంగంలో అడుగుపెట్టి అందులోనూ ప్రముఖ కథానాయికగా పేరుతెచ్చుకున్నారు.

పురస్కారాలు, అవార్డులు:
ఏడేళ్ళ వయస్సులోనే కేరళ రాష్ట్రపు ఉత్తమ బాలనటి అవార్డు పొందగా, 1982లో తమిళనాడు రాష్ట్రం నుంచి ఉత్తమనటిగా అవార్డు, 1991లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రపు ఉత్తమనటిగా బంగారునంది అవార్డు, 5 సార్లు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు, 2013లో భారతప్రభుత్వపు పడ్మశ్రీ అవార్డులను స్వీకరించారు.

విభాగాలు: తెలుగు సినిమా నటులు,  పద్మశ్రీ అవార్డు గ్రహీతలు, నంది అవార్డు గ్రహీతలు,  1963లో జన్మించినవారు, 2018లో మరణించినవారు


 = = = = =

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక