7, సెప్టెంబర్ 2013, శనివారం

పి.పాండురంగారావు (P.Pandu Ranga Rao)

పి.పాండురంగారావు
జననంమార్చి 5, 1975
స్వస్థలంచిన్నచింతకుంట
హోదాజిల్లా ఆడిటు అధికారి, నల్గొండ
గుర్తింపులురాష్ట్ర స్థాయిలో జన్మభూమి అవార్డు (1997), జిల్లా స్థాయి ఉత్తమ గజిటెడ్ అధికారిగా గుర్తింపు (2013),
పి.పాండురంగారావు మార్చి 5, 1975న మహబూబ్‌నగర్ జిల్లా చిన్నచింతకుంట మండల కేంద్రంలో జన్మించారు. స్థానికంగా హైస్కూలు వరకు విద్య అభ్యసించి, మహబూబ్‌నగర్‌లో బీఎస్సీ పూర్తిచేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి బీఎడ్, ఎంఏ (తెలుగు) పట్టా పొంది, కొంతకాలం తెలుగు ఉపాధ్యాయులుగా పనిచేసి, 2007లో గ్రూప్-1కు ఎన్నికై రాష్ట్ర ఆడిట్ (స్టేట్ ఆడిట్) శాఖ లో సహాయ ఆడిటు అధికారిగా చేరినారు. మే 2012 నుంచి మహబూబ్ నగర్ జిల్లా ఆడిటు అధికారి (ఇంచార్జి)గా బాధ్యతలు నిర్వహించారు. 2013 గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టరు చేతుల మీదుగా ఉత్తమ గజిటెడ్ అధికారిగా గుర్తింపు పత్రం పొందారు. 2014లో జిల్లా ఆడిటు అధికారిగా పదోన్నతి పొంది నల్గొండ జిల్లా ఆడిటు అధికారిగా పనిచేస్తున్నారు. 2014 స్వాతంత్ర్య దినోత్సవం నాడు నల్గొండ జిల్లాలో కూడా ఉత్తమ గజిటెడ్ అధికారిగా ప్రశంసాపత్రం స్వీకరించారు.

ప్రారంభ జీవనం:
మార్చి 5, 1975న చిన్నచింతకుంటలో టైలరింగ్ వృత్తి నిర్వహిస్తున్న తల్లిదండ్రులకు చివరి (4వ) కుమారునిగా జన్మించిన పాండురంగారావు 10వ తరగతి వరకు స్థానికంగా జిల్లా పరిషత్తు హైస్కూలులో అభ్యసించారు. ఇంటర్మీడియట్ ఎంఎన్‌ఎస్ కళాశాల నుంచి, బీఎస్సీ డిగ్రీ ఎంవీఎస్ కళాశాల నుంచి పూర్తిచేశారు. 1998లో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి తెలుగులో ఎం.ఏ. పట్టా పొందడమే కాకుండా ఉస్మానియా విశ్వవిద్యాలయంలోనే తొలి ర్యాంకు పొందినారు. ఆ తదుపరి బీఎడ్ పూర్తిచేశారు. 1997-98లో పేదరిక నిర్మూలన కార్యక్రమం (DPIP) మహబూబ్‌నగర్ యూనిట్ కో-ఆర్డినేటర్‌గా పనిచేశారు.

ఉద్యోగ బాధ్యతలు:
2002లో డీఎస్సీలో ఎంపికై కోయిలకొండ మండలం గాంధీనగర్ తండాలో కొంతకాలం ఉపాధ్యాయులుగా పనిచేశారు. 2007లో గ్రూప్-1కు ఎంపికై, రాష్ట్ర ఆడిటు శాఖలో సహాయ ఆడిటు అధికారిగా వనపర్తిలో బాధ్యతలు స్వీకరించారు. మే 2012 నుంచి జిల్లా ఆడిటు అధికారి (ఇంచార్జి)గా విధులు నిర్వహించి ఆ తర్వాత జిల్లా ఆడిటు అధికారిగా పదోన్నతిపై నల్గొండజిల్లాకు బదిలీ అయి ప్రస్తుతం అక్కడే పనిచేస్తున్నారు.

గుర్తింపులు:
 • 1997లో రాష్ట్రపతి చేతుల మీదుగా రాష్ట్ర స్థాయి జన్మభూమి అవార్డు స్వీకరించారు.
 • 2013 జనవరి 26న జిల్లా కలెక్టరుచే ఉత్తమ గజిటెడ్ అధికారిగా గుర్తింపు పత్రం పొందినారు.
 • 2014 ఆగస్టు 15న నల్గొండ జిల్లాలో ఉత్తమ గజిటెడ్ అధికారిగా ప్రశంసాపత్రం పొందారు.


విభాగాలు: మహబూబ్‌నగర్ జిల్లా అధికారులు, చిన్నచింతకుంట మండలం


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక