8, సెప్టెంబర్ 2013, ఆదివారం

కాళోజి నారాయణరావు (Kaloji Narayana Rao)

కాళోజి నారాయణరావు
(1914-2002)
జననంసెప్టెంబర్ 9, 1914
రంగంరచయిత, సమరయోధుడు,
రచనలునా గొడవ (ఆత్మకథ),
గుర్తింపులుపద్మవిభూషణ్, కాకతీయ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్,
మరణంనవంబర్ 13, 2002
ప్రజాకవిగా పేరుపొందిన కాళోజీ నారాయణరావు సెప్టెంబర్ 9, 1914కర్ణాటక రాష్ట్రం, బీజాపూర్ జిల్లాలోని రట్టిహళ్లి గ్రామంలో జన్మించారు. బీజాపూర్ నుంచి వరంగల్ జిల్లాకు తరలివచ్చిన కాళోజీ కుటుంబం కాజీపేట మండలం మడికొండలో స్థిరపడింది. ప్రాథమిక విద్యానంతరం హైదరాబాదు పాతబస్తీలోని చౌమహల్లా పాఠశాలలో కొంతకాలం చదివిన కాళోజీ, అటు తరువాత సిటీ కాలేజ్‌లోనూ, హన్మకొండలోని కాలేజియేట్ హైస్కూల్‌లోనూ చదువు కొనసాగించి మెట్రిక్యులేషన్ పూర్తిచేశారు. 1939లో హైదరాబాద్‌లో హైకోర్టుకు అనుబంధంగా ఉన్న లా కళాశాల నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు.

1930 నుంచే కాళోజీ గ్రంథాలయోద్యమంలో ఎంతో చురుగ్గా పాల్గొన్నారు. సత్యాగ్రహోద్యమంలో పాల్గొని 25 సంవత్సరాల వయసులో జైలుశిక్ష అనుభవించారు. మాడపాటి హనుమంతరావు, సురవరం ప్రతాపరెడ్డి, జమలాపురం కేశవరావు, బూర్గుల రామకృష్ణారావు, పి.వి.నరసింహారావు వంటి వారితో కలిసి కాళోజీ అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు. విద్యార్థి దశలోనే నిజాం ప్రభుత్వ నిషేధాజ్ఞలను ఉల్లంఘించి వరంగల్లులో గణపతి ఉత్సవాలు నిర్వహించారు. తెలంగాణలో అక్షరజ్యోతిని వ్యాపింపజేయాలన్న తపనతో ఆంధ్ర సారస్వత పరిషత్తును స్థాపించిన ప్రముఖుల్లో కాళోజీ ఒకరు. రజాకార్ల దౌర్జన్యాన్ని ప్రతిఘటిస్తూ 1945లో పరిషత్తు ద్వితీయ మహాసభలను దిగ్విజయంగా నిర్వహించడంలో కాళోజీ ప్రదర్శించిన చొరవ, ధైర్యసాహసాలను మెచ్చుకొని తీరాల్సిందే. వరంగల్ కోటలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడానికి ప్రయత్నించినందుకు ఆయనకు నగర బహిష్కరణశిక్ష విధించారు. స్వరాజ్య సమరంలో పాల్గొని ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులు బహిష్కరణకు గురైనప్పుడు, వారిని నాగపూర్ విశ్వవిద్యాలయంలో చేర్పించి ఆదుకోవడంలో కాళోజీ పాత్ర అనన్యం.

1953లో తెలంగాణ రచయితల సంఘం ఉపాధ్యక్షుడుగా ఎన్నికయ్యారు. 1958లో ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి శాసనమండలికి ఎన్నికయ్యారు. 1977లో సత్తుపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంటుగా జలగం వెంగళరావుపై పోటీచేసి ఓడిపోయారు. సామాన్యుడే నా దేవుడని ప్రకటించిన కాళోజీ నవంబర్ 13, 2002 న తుదిశ్వాస విడిచారు.
కాళోజి నారాయణరావు
జనరల్ నాలెడ్జి

గుర్తింపులు:
కాకతీయ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయగా, భారత ప్రభుత్వం పద్మవిభూషణ్ అవార్డుతో సత్కరించింది. కాళోజీ జన్మదినమైన సెప్టెంబరు 9 తేదిని తెలంగాణ ప్రభుత్వం "తెలంగాణ భాషాదినోత్సవం"గా ప్రకటించింది. వరంగల్‌లో నెలకొల్పిన వైద్యవిశ్వవిద్యాలయానికి కాళోజీ పేరుపెట్టబడింది.
బ్లాగులో కాళోజీ గురించి శోధించండి

కాళోజీ యొక్క ముఖ్య కొటేషన్లు:
  • ఒక్క సిరాచుక్క లక్షల మెదళ్లకు కదలిక
  • పుట్టుక నీది-చావు నీది, బతుకంతా దేశానిది
  • భాష రెండు తీర్లు - ఒకటి బడి పలుకుల భాష, రెండోది పలుకు బడుల భాష. పలుకు బడుల భాషగావాలె
  • ఉదయం కాదనుకోవడం నిరాశ, ఉదయించి అట్లానే ఉండాలనుకోవడం దురాశ
  • అన్యభాషలు నేర్చి ఆంధ్రంబు రాదంచు-సకిలించు ఆంధ్రుడా! చావవెందుకురా
  • నవయుగంబున నాజీ నగ్ననృత్యమింకెన్నాళ్ళు ......హింసపాపమని యెంచు దేశమున హిట్లరిత్వమింకెన్నాళ్ళు.
  • కండకండలుగా కోసి కాకులకు వేయాలె, కాలంబు రాగానె కాటేసి తీరాలె
  • దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకొని దొరలై వెలిగేదెన్నాళ్ళు.
  • అన్నపు రాశులు ఒకచోట, ఆకలిచావులు ఒకచోట 
  • అన్యాయాన్ని ఎదిరించే వాడే నాకు ఆరాధ్యుడు 
ఇవి కూడా చూడండి:

హోం
విభాగాలు: వరంగల్ జిల్లా సమరయోధులు, వరంగల్ జిల్లా రచయితలు, వరంగల్ జిల్లా రాజకీయ నాయకులు,  1914లో జన్మించినవారు, 2002లో మరణించినవారు,


 = = = = =



(CCKRao సీరీస్ క్విజ్ మరియు జికె పుస్తకాల వివరాల కోసం ఇక్కడ చూడండి))

1 కామెంట్‌:

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక