ఆర్.రాజగోపాల్ రెడ్డి
| |
జననం | అక్టోబరు 10, 1933 |
స్వస్థలం | రెడ్డివారిపల్లి |
పదవులు | రాష్ట్ర మంత్రి, 5 సార్లు ఎమ్మెల్యే, |
నియోజకవర్గం | లక్కిరెడ్డిపల్లి |
రెడ్డెప్పగారి రాజగోపాల్ రెడ్డి కడప జిల్లాకు చెందిన రాజకీయనాయకుడు. అక్టోబరు 10, 1933న రెడ్డివారిపల్లిలో జన్మించిన రాజగోపాల్ రెడ్డి ఇంజనీరుగా పనిచేసి తర్వాత రాజకీయాలలో ప్రవేశించారు. లక్కిరెడ్డిపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 5 సార్లు ఎమ్మెల్యే అయ్యారు. పీవి.నరసింహరావు, ఎన్టీరామారావు మంత్రివర్గాలలో స్థానం పొందినారు. 1972లో జైఆంధ్ర ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. 2013, సెప్టంబరు 18న మరణించారు.
రాజకీయ ప్రస్థానం:
1959లో రాజకీయ ప్రవేశం చేసిన రాజగోపాల్ రెడ్డి 1962లో తొలిసారిగా లక్కిరెడ్డిపల్లి నుంచి పోటీచేసి పరాజయం పొందారు. 1967లో కాంగ్రెస్ తరఫున లక్కిరెడ్డిపల్లి నుంచి విజయం సాధించారు. 1972లో రెండోసారి కూడా విజయం సాధించి కొంతకాలం పి.వి.నరసింహరావు మంత్రివర్గంలో పనిచేశారు. 1977లో జనతాపార్టీ తరఫున పోటీచేసి ఓడిపోయారు. 1983లో తెలుగుదేశం పార్టీలో చేరి ఆ పార్టీ తరఫున విజయం సాధించారు. 1985లో కూడా గెలుపొంది ఎన్టీరామారావు మంత్రివర్గంలో స్థానం పొందారు. ఆ తర్వాత ఎన్టీయార్‌తో విబేధించి నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డితో జతకట్టి, ఆ తదనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరారు. 1989లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసి 5వ సారి ఎమెల్యే అయ్యారు. 1994లో మరోసారి పోటీచేసిననూ పరాజయం పొందారు. అప్పటి నుంచి క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు.
బంధుత్వం:
రాజగోపాల్ రెడ్డి కుమారుడు రమేష్ రెడ్డి కూడా ఒకసారి శాసనసభకు ఎన్నికయ్యారు. సోదరుడు సూర్యనారాయణరెడ్డి జడ్పీ చైర్మెన్‌గా పనిచేశారు.

విభాగాలు: కడప జిల్లా ప్రముఖులు, రాష్ట్ర మంత్రులు, లక్కిరెడ్డిపల్లి అసెంబ్లీ నియోజకవర్గం, 4వ శాసనసభ సభ్యులు, 5వ శాసనసభ సభ్యులు, 7వ శాసనసభ సభ్యులు, 8వ శాసనసభ సభ్యులు, 9వ శాసనసభ సభ్యులు, 2013లో మరణించినవారు, |
= = = = =
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి